సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే సినిమాల షూటింగ్ లను మాత్రం పూర్తి చేసే పనిలో పడ్డాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ఏప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న నాని టక్ జగదీష్ రిలీజ్ కు సిద్దంగా ఉంది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తో పాటు శ్యామ్ సింగ రాయ్ సినిమాను కూడా ఇటీవలే పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా వీటితో పాటు నాని అంటే సుందరానకి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రోచేవారెవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఈసినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను స్టార్ట్ చేసినా కరోనా వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈసినిమా సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయగా తాజాగా సెకండ్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
#AnteSundaraniki 2nd schedule is wrapped! ✈️😍@NameisNani #NazriyaNazim #VivekAthreya @MythriOfficial pic.twitter.com/i4MQRO1bWn
— Always Nani Fans™ (@AlwaysNaniFans) August 13, 2021
కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ ఈసినిమాను నిర్మిస్తుంది. కాగా ఈసినిమా షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేసి రిలీజ్ కు సిద్దం చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























