కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్ మళ్ళీ మొదలైంది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా పెళ్లి తరువాత లైఫ్ ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో పోసాని నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
ఇక ఈవిషయాన్ని మేకర్స్ ప్రకటిస్తూ ఈసినిమాలో పోసాని పాత్ర ఎలా ఉంటుందో కూడా డిటైల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఈసినిమా కుటుంబరావు గా నటిస్తుండగా...ఫ్యామిలీ మాన్ గా, భర్తల హక్కుల కోసం పోరాడే వ్యక్తి గా, రెస్టారెంట్ ల వద్ద డిస్కౌంట్ అడిగే వ్యక్తి గా ఉంటుందని చెప్పారు. కాగా రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.
t@tgkeerthikumar
It was like a firecracker 🧨 having him on-set. Here comes our KUTUMBA RAO!! 😃 #mallimodalaindi
మరోవైపు యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గార్లపాటి రమేష్, డాక్టర్ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.