
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 45


పాయల్ కు శాండల్ వుడ్ ఆఫర్

'రిపబ్లిక్' జగపతి బాబు లుక్ రిలీజ్

"#GOPICHAND 30" మూవీ లో విలన్ గా రాజశేఖర్ ?

వరుడు కావలెను షూటింగ్ కంప్లీట్

శాకుంతలం లో బాలీవుడ్ నటుడు

"గూడుపుఠాణి "మూవీ లో నెగటివ్ రోల్ లో రఘుకుంచె

ఆనంద్ దేవరకొండ 'హైవే' లో మిర్జాపూర్ నటుడు

"సలార్ "కు భారీ డెన్ సెట్

కారవాన్ లో సమంత

దీపావళి కి రానున్న 'గని'

రాశీఖన్నా కు కోలీవుడ్ లో బంపరాఫర్

జెట్ స్పీడ్ లో నాని మీట్ క్యూట్

డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో తమన్నా బిజీ
ఓ మై కడవులే రీమేక్ లో అతిథి పాత్రలో..!

"అఖండ "మూవీ అప్ డేట్

'ఆచార్య' టాకీ పార్ట్ కంప్లీట్

న్యూ మూవీకి మెహరీన్ గ్రీన్ సిగ్నల్

"ఏజెంట్ " గుర్రపు స్వారీ
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

పాయల్ కు శాండల్ వుడ్ ఆఫర్
సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. యంగ్ హీరోల పక్కన నటిస్తూనే మరోపక్క సీనియర్ హీరోల పక్కన జోడి కట్టేందుకు పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం "కిరాతక " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ రాజ్ పుత్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.పాయల్ ఇప్పుడు శాండల్ వుడ్ ఆఫర్ అందుకున్నారు.

'రిపబ్లిక్' జగపతి బాబు లుక్ రిలీజ్
ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతిబాబు.. ఇప్పుడు విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో సాయి తేజ్ హీరోగా వస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలిజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా ఖచ్చితంగా థియేటర్ల లోనే రిలీజ్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.

"#GOPICHAND 30" మూవీ లో విలన్ గా రాజశేఖర్ ?
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా కబడ్డీ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా " సీటీమార్ " విడుదలకు సిద్ధంగాఉంది. బి గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ ,నయనతార జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ "మూవీ కూడా రిలీజ్ కానుంది. హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పక్కా కమర్షియల్ "మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వరుడు కావలెను షూటింగ్ కంప్లీట్
యంగ్ హీరో నాగ శౌర్య కూడా ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఒకటి కాదు రెండు ఇప్పుడు నాగశౌర్య చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా.. కొన్ని సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ఇందులో లక్ష్య సినిమా ఇప్పటికే రిలీజ్ అవుతుండగా తాజాగా వరుడు కావలెన్ సినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

శాకుంతలం లో బాలీవుడ్ నటుడు
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “శాకుంతలం” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాతో అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈసినిమా షూటంగ్ దాదాపు ప్రత్యేకమైన సెట్స్ లోనే జరగునుంది. అందుకోసం గుణశేఖర్ కూడా ఈసినిమా సెట్స్ చాలా రిచ్ గా ఉండేలా చూస్తున్నాడట.

"గూడుపుఠాణి "మూవీ లో నెగటివ్ రోల్ లో రఘుకుంచె
"బాచి "మూవీ తో సింగర్ గా పరిచయం అయిన రఘు కుంచె సుమారు 700 సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. సక్సెస్ ఫుల్"బంపర్ ఆఫర్" మూవీ తో రఘు సంగీత దర్శకుడిగా మారారు. ఆ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రఘు కుంచె సక్సెస్ ఫుల్ "పలాస 1978’" మూవీ లో విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రఘుకుంచె ఇప్పుడు మరో మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆనంద్ దేవరకొండ 'హైవే' లో మిర్జాపూర్ నటుడు
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ తన అన్న పేరును వాడుకోకుండానే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన మొదటి సినిమా దొరసాని తోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు.

"సలార్ "కు భారీ డెన్ సెట్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభా, శృతిహాసన్ జంటగా తెలుగు , కన్నడ భాషలలో 1970 ల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “సలార్ “ మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ గోదావరి ఖని వద్ద కోల్ మైన్స్ లో జరిగింది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన “సలార్ “మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.

కారవాన్ లో సమంత
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం. సమంత ఒక తమిళ మూవీ లో కూడా నటిస్తున్నారు.

దీపావళి కి రానున్న 'గని'
ప్రస్తుతం వరుణ్ తేజ్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేశాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ చేసి మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక ఈమూవీకి సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ త్వరలోనే విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది.

రాశీఖన్నా కు కోలీవుడ్ లో బంపరాఫర్
సక్సెస్ ఫుల్ “ఊహలు గుసగుసలాడే” మూవీ తో రాశీఖన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా తమిళ మూవీస్ లో బిజీగా మారారు.హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.మూడు వెబ్ సిరీస్ లకు రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

జెట్ స్పీడ్ లో నాని మీట్ క్యూట్
హీరోగా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క న్యాచురుల్ స్టార్ నాని నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. హీరోగానే కాదు.. నిర్మాతగానూ నానిది సక్సెస్‌ఫుల్ జర్నీనే. తొలుత `ఆ` అనే ప్రయోగాత్మక చిత్రం తీశాడు. ఆ తరవాత వచ్చిన `హిట్` కూడా… సూపర్ హిట్టయ్యింది. ఇక హిట్ 2 కూడా లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఈసినిమా ప్రారంభమైంది కూడా. ఇక దీనితో పాటు నాని మరో సినిమాను నిర్మిస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమాకు నాని సిస్టర్ దీప్తి ఘంటా దర్శకత్వం వహిస్తున్నారు.

డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో తమన్నా బిజీ
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో తమన్నా బిజీ గా ఉన్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లతో కాల్షీట్స్ అడ్జెస్ట్ చేస్తూ తమన్నా ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు.

కోవిడ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో 'మంచి రోజులు వచ్చాయి'
కరోనా వల్ల గత ఏడాది నుండి సినీ పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూస్తూనే ఉన్నాం. సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి... రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే కొంత మంది డైరెక్టర్లకు మాత్రం ఈ కరోనా కొత్త కథలను రాయడానికి కలిసొచ్చింది. అంతేకాదు కరోనా నేపథ్యంలో కూడా ఇప్పటికే కొన్ని సినిమాలు తెరకెక్కిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా కరోనా నేపథ్యంలోనే వస్తున్నట్టు తెలుస్తుంది. మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి అన్న సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్…
ఓ మై కడవులే రీమేక్ లో అతిథి పాత్రలో..!
ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా కాకుండా విశ్వక్ సేన్ ఓ మై కడవులే సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండగా, అశ్వథ్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు.

"అఖండ "మూవీ అప్ డేట్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ కథానాయకుడిగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర "అఖండ "మూవీకి హైలైట్ కానుంది. దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

'ఆచార్య' టాకీ పార్ట్ కంప్లీట్
మెగాస్టార్చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కరోనా వల్ల బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈసినిమా తిరిగి మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. అన్నీ పరిస్థితులు బావుండే ఈనెల 13 న ఈసినిమా రిలీజ్ అయ్యేది కానీ కరోనా వల్ల అది కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

"పిశాచి 2 "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
బి స్టూడియోస్ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో నాగ , ప్రయాగ మార్టిన్ ప్రధాన పాత్రలలో రూపొందిన హారర్ తమిళ మూవీ "పిశాసు " ఘనవిజయం సాధించింది. "పిశాసు " తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "పిశాచి " కూడా సక్సెస్ అయ్యింది. ఈ మూవీ కి అర్రోల్ కారెల్లి సంగీతం అందించారు. ఇప్పుడు "పిశాసు " మూవీ సీక్వెల్ "పిశాసు2 " మూవీ తెరకెక్కుతుంది.

న్యూ మూవీకి మెహరీన్ గ్రీన్ సిగ్నల్
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “నెంజిల్ తునివిరుందాయ్ “మూవీ తో కోలీవుడ్ కు , “డి ఎస్ పి దేవ్ ” మూవీ తో పంజాబీ చిత్రపరిశ్రమకు మెహరీన్ పరిచయం అయ్యారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “, మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న “మంచి రోజులు వచ్చాయి” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.