థియేటర్లు ఓపెన్ అవ్వడంతో సినిమా రిలీజ్ ల సందడి మొదలైంది. ఇక మేకర్స్ కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా తమ సినిమాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈనేథ్యంలోనే వారానికి కనీసం అరడజను సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా తన సినిమాకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేశాడు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ఈసినిమా కూడా రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. “గల్లీ రౌడీ” సెప్టెంబర్ 3న రిలీజ్ అవుతున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వైవా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తుండగా… చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో సందీప్ కిషన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: