“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపొందుతున్న “హరిహర వీరమల్లు” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“హరిహర వీరమల్లు” మూవీ గురించి నిధి మాట్లాడుతూ.. దర్శకుడు క్రిష్ , హీరో పవన్ కళ్యాణ్ లతో వర్క్ చేయడం హ్యాపీ గా ఉందనీ , సినిమాలోని ప్రతి సన్నివేశం మరియు ప్రతి అంశం మనసును కదిలించేలా ఉంటుందనీ , “హరిహర వీరమల్లు” మూవీ తన కెరీర్ కు పెద్ద బూస్ట్ అనీ మూవీ పై నిధి హైప్ ను క్రియేట్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: