తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం. సమంత ఒక తమిళ మూవీ లో కూడా నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఒక వారం రోజుల షూటింగ్ తో చిత్రీకరణ కంప్లీట్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిట్నెస్ అధిక ప్రాధాన్యత నిచ్చే సమంత తన యోగా , వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. తాను టైటిల్రోల్ని పోషిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం” కోసం కఠినమైన ఆరోగ్య నియమాల్ని పాటిస్తూ చక్కటి శిక్షణ తీసుకున్నాననీ , ఈ మూవీ కై ఎప్పుడూ లేని విధంగా కఠినమైన నియమాల్ని పాటించాననీ , .సినిమా చూస్తేతన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కిందనే భావన కలిగిందనీ సమంత చెప్పారు. భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న “శాకుంతలం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































