మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో 5 భాషలలో 5 గురు సింగర్స్ గానం చేసిన “పుష్ప-ది రైజ్” తొలి సింగిల్ దాక్కో దాక్కో మేక ను ఆగస్ట్ 13 ఉదయం 11:07 నిమిషాలకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ మేకోవర్ హైలైట్‌గా నిలిచింది. ఈ సాంగ్ 1 మిలియన్ లైక్స్ తో యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. 5 భాషల్లో కలిపి 10 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించింది. “పుష్ప : ది రైజ్” మూవీ సింగిల్ పై బహు భాషల సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక స్పందించారు. సాంగ్ సూపర్బ్ , అమేజింగ్ క్రేజీ స్టఫ్ అనీ , పెద్ద ఐస్ బర్గ్ లో చిన్న ముక్కను చూపించారంటూ , ఇది సరైన పద్దతి కాదు అంటూ రష్మిక కామెంట్ చేశారు. దర్శకుడు సుకుమార్ , హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “పుష్ప ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: