
ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 9


షాలిని పాండే ఖాతాలో మరో సినిమా

అనిల్ రావిపూడికి ఈ రోజు వెరీ స్పెషల్

కింగ్ నాగార్జున సీక్వెల్ మూవీస్

రామ్, పూరీ ఇస్మార్ట్ శంకర్ మొదలైపోయింది

లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీ

సెన్సార్ పూర్తి చేసుకున్న యాత్ర

Mr. మజ్ను ట్రైలర్ పై రామ్ చరణ్ స్పందన

మహర్షి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్ - వైఎస్ ఇద్దరి సీఎంలలో గెలుపెవరిదో?

ఈసారైనా నాని డ్రీమ్ నిజమయ్యేనా!

వరుణ్ తేజ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ?

సరిహద్దుల్లో యాక్షన్ కు దిగిన గోపీచంద్

Mr.మజ్ను ట్రైలర్ రిలీజ్

ఎఫ్2 మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

క్రైమ్ థ్రిల్లర్‌లో మహేష్ బాబు?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `మహర్షి`తో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని సి.అశ్వనీదత్, దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయ్యాక సుకుమార్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు మహేష్. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే... `అర్జున్ రెడ్డి` దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ మహేష్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం... ఇదొక క్రైమ్…

షాలిని పాండే ఖాతాలో మరో సినిమా
`అర్జున్ రెడ్డి` చిత్రంలో ప్రీతి పాత్రలో నటించి యువతరానికి ప్రీతిపాత్రమైంది షాలిని పాండే. ఆ తరువాత `మహానటి`, `యన్.టి.ఆర్. కథానాయకుడు` వంటి బయోపిక్స్‌లో అతిథి పాత్రల్లో కనిపించి మురిపించింది. త్వరలో ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ కి జోడీగా `118` చిత్రంలో కనిపించబోతోంది. మరోవైపు... తమిళ చిత్రాలు `100% కాదల్`, `గొరిల్లా`, `అగ్ని సిరగుగళ్` (తెలుగులో `జ్వాల`)తోనూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే... ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ హిందీ చిత్రంలో కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. విలక్షణ నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది…

అనిల్ రావిపూడికి ఈ రోజు వెరీ స్పెషల్
ప్రస్తుతం టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న యువ దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. `పటాస్`తో మొదలైన ఈ యంగ్ డైరెక్టర్ జైత్రయాత్ర `ఎఫ్ 2` వరకు కొనసాగుతూనే ఉంది. కాగా... అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా `పటాస్` సరిగ్గా నాలుగేళ్ళ క్రితం ఇదే జనవరి 23న విడుదలై... సూపర్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. కట్ చేస్తే... నాలుగేళ్ళ తన ప్రయాణంలో నాలుగు చిత్రాలతో ఈ దర్శకుడు బాక్సాఫీస్ ఫేవరేట్ అయిపోయాడు. `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`... ఇలా జానర్ ఏదైనా... ఎంటర్టైన్మెంట్నే తన ప్రధాన అస్త్రంగా చేసుకుని తనదైన…

కింగ్ నాగార్జున సీక్వెల్ మూవీస్
కింగ్ నాగార్జున హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వం లో రూపొందిన మన్మధుడు, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు ప్రేక్షకులను అలరించి ఘనవిజయం సాధించాయి. ఈ సూపర్ హిట్ సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించారు. ఇప్పుడు ఆ సినిమాల సీక్వెల్స్ నాగార్జున నటిస్తూ నిర్మించనున్నారు.

సాయిపల్లవి ఖాతాలో మరో రికార్డు
ఈ జనరేషన్ హీరోర్డుయిన్స్లో సాయిపల్లవి రూటే సెపరేటు. నటనలోనే కాదు నర్తనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ముఖ్యంగా... సాయిపల్లవి డ్యాన్స్‌లకు `ఫిదా`కాని ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా... యూ ట్యూబ్‌లో ఆమె నర్తించిన పాటలకు దక్కుతున్న ఆదరణను చెప్పేయొచ్చు. నిన్నటికి నిన్న `ఫిదా`లోని `వచ్చిండే` పాటతో... ధనుష్ `వై దిస్ కొలవెరి డీ` (చిత్రం పేరు `3`) పేరిట ఉన్న రికార్డును బద్ధలు గొట్టింది సాయిపల్లవి. `వై దిస్ కొలవెరి డీ` పాటకు 174 మిలియన్లకు పైగా వ్యూస్ ఉంటే... `వచ్చిండే` పాటకి 178…

రామ్, పూరీ ఇస్మార్ట్ శంకర్ మొదలైపోయింది
డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్...ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్, డిఫరెంట్ టైటిల్ తోనే అప్పుడే అందరూ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసేశాడు పూరీ. ఇస్మార్ట్ శంకర్ డబుల్ సిమ్ అని వచ్చిన ఫస్ట్ లుక్..టైటిల్ అందరికీ నచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ ఫుల్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీ
బెస్ట్ కొరియోగ్రాఫర్ గా 3నంది, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న రాఘవ లారెన్స్ 1993 సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఉళప్పాలి మూవీ తో కొరియోగ్రాఫర్ గా కోలీవుడ్ లో ఎంటరయి, 1999 సంవత్సరంలో స్పీడ్ డాన్సర్ సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా మారారు. రాఘవ లారెన్స్ 2004 సంవత్సరంలో మాస్ వంటి సూపర్ హిట్ మూవీ తో డైరెక్టర్ గా టాలీవుడ్ లో ప్రవేశించారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న యాత్ర
రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో .. మహి వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో యాత్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది.

Mr. మజ్ను ట్రైలర్ పై రామ్ చరణ్ స్పందన
అక్కినేని అఖిల్ హీరోగా తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా Mr. మజ్ను. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అఖిల్ కు మంచి స్నేహితుడైన మెగా హీరో రామ్ చరణ్ కూడా ట్రైలర్ పై స్పందించాడు.

మహర్షి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పై గత కొద్దిరోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్ లో ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల చేస్తున్నట్టు ముందు తెలిపినా..ఆతరువాత రిలీజ్ డేట్ వాయిదా పడిందని..ఏప్రిల్ 25వ తేదీన మహర్షి సినిమాను రిలీజ్ చేయాలన్న యోచనలో చిత్రయూనిట్ ఉందని టాక్స్ వినిపించాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో చిన్న కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు అందరూ.

ఎన్టీఆర్ - వైఎస్ ఇద్దరి సీఎంలలో గెలుపెవరిదో?
రాజకీయాల్లోకి ఎంతో మంది నాయకులు వస్తుంటారు..పోతుంటారు...కానీ కొంత మంది నాయకులు మాత్రమే ప్రజల మనసులో నిలుచుంటారు. అలా ప్రజల మనసులో నిలిచిపోయిన నాయకులు నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పొచ్చు. కేవలం నాయకుల్లా కాకుండా.. ప్రజా నాయకుల్లా వారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి వారిద్దరి బయోపిక్ లు ఇప్పుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈసారైనా నాని డ్రీమ్ నిజమయ్యేనా!
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు న్యాచురల్ స్టార్ నాని పెద్ద అభిమాని అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక నాని కూడా తన అభిమాన దర్శకుడి దర్శకత్వంలో నటించేందుకు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. అయితే ఇన్నాళ్లకు నాని కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిరంజీవి - కొరటాల మూవీ కోసం... పరిశీలనలో నలుగురు హీరోయిన్ల పేర్లు?
`ఖైదీ నంబర్ 150`తో మెగా రీ - ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... ప్రస్తుతం భారీ బడ్జెట్ మూవీ `సైరా నరసింహారెడ్డి`తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి తన పార్ట్‌ను పూర్తిచేయగానే... సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తన 152వ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు చిరు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా... త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో చిరుకి జోడీగా నటించే హీరోయిన్ ఎవరు? అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం... ప్రస్తుతం నలుగురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలిసింది…

రజనీకాంత్ పొలిటిషియన్ కాదు.. పోలీస్ ఆఫీసర్ అట
కేవలం ఎనిమిది నెలల గ్యాప్‌లో మూడు చిత్రాలతో సందడి చేసి ఆశ్చర్యపరిచారు సూపర్ స్టార్ రజనీకాంత్. `కాలా`, `2.ఓ`, `పేట` పేర్లతో వచ్చిన ఈ మూడు సినిమాలూ రజనీ అభిమానులను అలరించాయి. ఇదిలా ఉంటే... సూపర్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందనున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే... తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

వరుణ్ తేజ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ?
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. గత ఏడాది `మహానటి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` చిత్రాలతో ఘనవిజయాలను తన ఖాతాలో జమచేసుకున్న ఈ యూత్ ఐకాన్... ప్రస్తుతం నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న `డియర్ కామ్రేడ్`లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే... ఇదే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమాని కూడా చేయడానికి విజయ్ దేవరకొండ ఒప్పందం కుదుర్చుకున్నాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు... ఈ చిత్రానికి…

సరిహద్దుల్లో యాక్షన్ కు దిగిన గోపీచంద్
తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు అక్కడే చిత్రీకరణ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు. యాభై రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో కూడా చిత్రీకరణ జరపనున్నారట.

Mr.మజ్ను ట్రైలర్ రిలీజ్
అఖిల్ అక్కినేని హీరోగా తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా Mr.మజ్ను. రిపబ్లిక్ డే కానుకగా ఈనెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే ఈరోజు ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఈ కార్యక్రమంలోనే Mr.మజ్ను సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

లక్ష్మీస్ ఎన్టీఆర్ - ఎన్టీఆర్ పాత్రలో నటించింది ఎవరో చెప్పిన వర్మ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఇప్పుడు అందరి చూపు పడింది. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ తో, పాటలతో సంచలనం సృష్టిస్తున్న వర్మ...ఈసినిమాలో ఇంకెన్ని ఆసక్తికర విషయాలు చూపిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి నిదర్శనం..ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి చిన్న వీడియోనే. ఈ వీడియోను నిన్న రిలీజ్ చేయగా..కేవలం 12 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో గాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

ఎఫ్2 మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను బాగా అలరిస్తుండటం...దానికి తోడు వెంకీ కామెడీకి అందరూ ఫిదా అవ్వడంతో సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు అందరూ. అటు ఓవర్సీస్ లోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎఫ్ 2 కలెక్షన్ల్ వర్షం కురిపిస్తూ లాభాలను తెచ్చిపెడుతోంది. మరి ఈ వారం రోజుల్లో ఎఫ్2 ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

చివరి షెడ్యూల్ లో నిను వీడని నీడను నేనే - త్వరలో రిలీజ్ ప్లాన్!
కార్తీక్ రాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ ఎమోషనల్ హార్రర్ ఎంటర్ టైనర్ గాతెరకెక్కుతున్న నిను వీడని నీడను నేనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఈసారి సందీప్ కిషన్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు అర్దమవుతోంది. ఇక గత కొంత కాలంగా ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.