అక్కినేని అఖిల్ హీరోగా తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా Mr. మజ్ను. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అఖిల్ కు మంచి స్నేహితుడైన మెగా హీరో రామ్ చరణ్ కూడా ట్రైలర్ పై స్పందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ చూసిన రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ట్రైలర్ చాలా బావుందని..అఖిల్, నిధి అగర్వాల్, వెంకీ అట్లూరి, బీవీఎస్ఎన్ ప్రసాద్ అలానే చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టాడు.
మరి అఖిల్ నటించిన గత చిత్రాలు అఖిల్, హలో ఆశించినంత ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దీంతో మంచి విజయం కోసం అఖిల్ తో పాటు అక్కినేని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం ఈసినిమాతోనైనా అఖిల్ కు మంచి సక్సెస్ దక్కుతుందేమో.
[youtube_video videoid=9CY19BnsPoM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: