లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీ

Lawrence To Make Bollywood Entry Soon,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Raghava Lawrence To Enter Bollywood,Actor Lawrence To Enter Hindi Movies,Raghava Lawrence Movies Latest News
Lawrence To Make Bollywood Entry Soon

బెస్ట్ కొరియోగ్రాఫర్ గా 3నంది, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న రాఘవ లారెన్స్ 1993 సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఉళప్పాలి మూవీ తో కొరియోగ్రాఫర్ గా కోలీవుడ్ లో ఎంటరయి, 1999 సంవత్సరంలో స్పీడ్ డాన్సర్ సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా మారారు. రాఘవ లారెన్స్ 2004 సంవత్సరంలో మాస్ వంటి సూపర్ హిట్ మూవీ తో డైరెక్టర్ గా టాలీవుడ్ లో ప్రవేశించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2007 సంవత్సరంలో తమిళం లో ముని వంటి కామెడీ హారర్ మూవీ లో నటించి, దర్శకత్వం వహించారు. ముని ఘనవిజయం తో ముని సీక్వెల్ సినిమాలలో నటించి, నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు. ముని 2 తెలుగు డబ్బింగ్ వెర్షన్ కాంచన విజయం సాధించింది. కాంచన సీక్వెల్ సినిమాలు కూడా తెలుగు లో రిలీజవుతున్నాయి. నటుడు, డాన్సర్, కొరియోగ్రాఫర్, మ్యూజిక్ కంపోజర్, నిర్మాత, దర్శకుడు లారెన్స్ ఇప్పుడు కాంచన హిందీ రీమేక్ మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు.

డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 2.0 మూవీ తో సౌత్ ఇండస్ట్రీ లో ప్రవేశించారు. కామెడీ, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కాంచన మూవీ హిందీ రీమేక్,లారెన్స్ దర్శకత్వం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అక్షయ్ కుమార్ నటించిన సౌత్ మూవీస్ హిందీ రీమేక్ సినిమాలన్నీ ఘనవిజయం సాధించాయి.

[subscribe]

[youtube_video videoid=4s7sb0QEZ3Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + fourteen =