`ఖైదీ నంబర్ 150`తో మెగా రీ – ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి… ప్రస్తుతం భారీ బడ్జెట్ మూవీ `సైరా నరసింహారెడ్డి`తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి తన పార్ట్‌ను పూర్తిచేయగానే… సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తన 152వ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు చిరు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా… త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో చిరుకి జోడీగా నటించే హీరోయిన్ ఎవరు? అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం… ప్రస్తుతం నలుగురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరంటే… `యన్.టి.ఆర్. కథానాయకుడు`తో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి విద్యా బాలన్, సీనియర్ బ్యూటీస్ త్రిష, నయనతార, తమన్నా. మరి… వీరిలో ఎవరు చివరాఖరికి చిరు పక్కన జోడీ కడతారో తెలియాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=mz6uyTzjAtA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: