`అర్జున్ రెడ్డి` చిత్రంలో ప్రీతి పాత్రలో నటించి యువతరానికి ప్రీతిపాత్రమైంది షాలిని పాండే. ఆ తరువాత `మహానటి`, `యన్.టి.ఆర్. కథానాయకుడు` వంటి బయోపిక్స్‌లో అతిథి పాత్రల్లో కనిపించి మురిపించింది. త్వరలో ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ కి జోడీగా `118` చిత్రంలో కనిపించబోతోంది. మరోవైపు… తమిళ చిత్రాలు `100% కాదల్`, `గొరిల్లా`, `అగ్ని సిరగుగళ్` (తెలుగులో `జ్వాల`)తోనూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే… ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ హిందీ చిత్రంలో కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. విలక్షణ నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కథానాయికగా నటించే ఛాన్స్ షాలిని పాండేని వరించిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. `బాంఫాడ్` పేరుతో రూపొందనున్న ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. ఇంతకుముందు `మేరి నిమ్మో`, `హెలికాప్టర్ ఈలా` వంటి హిందీ సినిమాల్లో నటించిన అనుభవం షాలినికి ఉంది. అయితే… ఆ రెండు చిత్రాల్లోనూ షాలిని హీరోయిన్ కాదు. మరి… తొలిసారిగా హిందీనాట కథానాయికగా తొలి అడుగులు వేస్తున్న షాలినికి… తొలి చిత్రం మంచి ఫలితాన్ని అందిస్తుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=hMYBZ_otOhc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: