ఈ జనరేషన్ హీరోర్డుయిన్స్‌లో సాయిపల్లవి రూటే సెపరేటు. నటనలోనే కాదు నర్తనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ముఖ్యంగా… సాయిపల్లవి డ్యాన్స్‌లకు `ఫిదా`కాని ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా… యూ ట్యూబ్‌లో ఆమె నర్తించిన పాటలకు దక్కుతున్న ఆదరణను చెప్పేయొచ్చు. నిన్నటికి నిన్న `ఫిదా`లోని `వచ్చిండే` పాటతో… ధనుష్ `వై దిస్ కొలవెరి డీ` (చిత్రం పేరు `3`) పేరిట ఉన్న రికార్డును బద్ధలు గొట్టింది సాయిపల్లవి. `వై దిస్ కొలవెరి డీ` పాటకు 174 మిలియన్లకు పైగా వ్యూస్ ఉంటే… `వచ్చిండే` పాటకి 178 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ సినిమాల్లోని పాటల పరంగా ఇది సరికొత్త రికార్డు అనే చెప్పాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా అదే ధనుష్‌తో `మారి 2` చిత్రం కోసం కలసి ఆడిపాడిన `రౌడీ బేబి` పాటతో నయా రికార్డును క్రియేట్ చేస్తోంది సాయిపల్లవి. జనవరి 2న యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ పాట… తక్కువ రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది. ఓ సౌత్ ఇండియన్ సినిమాలోని పాట… తక్కువ రోజుల్లోనే ఇన్ని వ్యూస్ ని రాబట్టుకోవడం అరుదైన విషయంగానే చెప్పాలి. మొత్తమ్మీద… యూ ట్యూబ్ రికార్డులని ఒడిసిపట్టుకోవడంలో సాయిపల్లవి, ధనుష్ పోటీపడడమే కాదు… కలసి కూడా రికార్డులు సృష్టించడం విశేషం. మున్ముందు… వీరి ఖాతాలో ఇంకెన్ని రికార్డులు నమోదు అవుతాయో చూడాలి.
[youtube_video videoid=09CDzuJbjeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: