రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో .. మహి వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో యాత్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 70ఎమ్ ఎమ్ బ్యానర్ పై శివ మేక సమర్పణ లో విజయ్ చిల్ల, శశిదేవ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, పోసాని, సుహాసిని, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కె సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సమర శంఖం, రాజన్న నిన్నాపగలరా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూద్దాం.
[youtube_video videoid=OuIJDxLeEBc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: