ఈసారైనా నాని డ్రీమ్ నిజమయ్యేనా!

Nani Dream Project with Mani Ratnam Latest Update,Mani Ratnam and Nani Combination Movie On Charts?,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Mani Ratnam and Nani Upcoming Combination Movie,Mani Ratnam Next With Natural Star Nani,Nani Next Project With Mani Ratnam,Actor Nani New Movie Updates
Nani Dream Project with Mani Ratnam Latest Update

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు న్యాచురల్ స్టార్ నాని పెద్ద అభిమాని అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక నాని కూడా తన అభిమాన దర్శకుడి దర్శకత్వంలో నటించేందుకు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. అయితే ఇన్నాళ్లకు నాని కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన డ్రీమ్ ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వం’ ను మణిరత్నం తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, విక్రమ్, జయంరవి మరియు విజయ సేతుపతి నటించనున్నట్ట టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ‘పొన్నియన్ సెల్వం’ కోసం మణిరత్నం నాని ని అడగటం జరిగిందట. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం ఎట్టిపరిస్థతిలోనూ ఈ అవకాశం వదులుకోకూడదని నాని చూస్తున్నాడట. ఎందుకంటే గతంలో నవాబ్ చిత్రం తీస్తున్నప్పుడు మణిరత్నం నాని ని అడగటం జరిగిందట. కానీ అప్పుడు డేట్స్ అడ్జస్ట్ కాక ఆ అవకాశం వదులుకున్నాడు.

దీంతో నాని సైతం ఈసారి ఈ ప్రాజెక్టు వదులుకోవాలనుకోవడం లేదట. ఎలాగైనా డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఈ సినిమాలో నటించాలనుకుంటున్నాడట. మరి ప్రస్తుతానికైతే ఇవి వార్తలుగానే వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. మరి చూద్దాం ఈసారైనా నాని డ్రీమ్ నిజమవుతుందో? లేదో?

కాగా ప్రస్తుతం నాని జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాని తరువాత విక్రమ్ కుమార్ తో మరో కొత్త సినిమా ఉండబోతుంది.

[subscribe]

[youtube_video videoid=b1MtI95yMps]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =