తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు అక్కడే చిత్రీకరణ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు. యాభై రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో కూడా చిత్రీకరణ జరపనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర నిర్మస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
అంతేకాదు త్వరగా షూటింగ్ పూర్తిచేసి మే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ కి యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. మరి కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న గోపీచంద్ కి ఈ సినిమాతోనైనా హిట్ దక్కుతుందేమో చూద్దాం.
[youtube_video videoid=9jOVc1hBOEE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: