అఖిల్ అక్కినేని హీరోగా తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా Mr.మజ్ను. రిపబ్లిక్ డే కానుకగా ఈనెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే ఈరోజు ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఈ కార్యక్రమంలోనే Mr.మజ్ను సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిథి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ టీజర్‌కు విశేష స్పందన లభించింది. పాటలు కూడా శ్రోతలను అలరిస్తున్నాయి. దీంతో సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నారు చిత్రయూనిట్. మరి చూద్దాం సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…
[youtube_video videoid=XSnFa0zqXRM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: