లక్ష్మీస్ ఎన్టీఆర్ – ఎన్టీఆర్ పాత్రలో నటించింది ఎవరో చెప్పిన వర్మ

RGV Reveals NTR Character Artist From Lakshmi's NTR,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,RGV Reveals NTR Character in Lakshmi's NTR,NTR Character in Lakshmi's NTR Movie,Lakshmi's NTR Movie Latest News,NTR Role in Lakshmi's NTR Movie
RGV Reveals NTR Character Artist From Lakshmi's NTR

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఇప్పుడు అందరి చూపు పడింది. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ తో, పాటలతో సంచలనం సృష్టిస్తున్న వర్మ…ఈసినిమాలో ఇంకెన్ని ఆసక్తికర విషయాలు చూపిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి నిదర్శనం..ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి చిన్న వీడియోనే. ఈ వీడియోను నిన్న రిలీజ్ చేయగా..కేవలం 12 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో గాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే…ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి గురించే చర్చ నడుస్తోంది. అచ్చం ఎన్టీఆర్ లాగే ఉండి..అన్నగారిని తలపిస్తున్న ఈయన ఎవరబ్బా అని అందరూ ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆ సస్పెన్స్ కు తెర దించాడు వర్మ. ఎన్టీఆర్ లుక్ లో కనిపించిన ఆయన పశ్చిమ గోదావరి కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ అంట.. అంతేకాదు ఈయనకు కొన్ని నెలల ముందు నుండే రామ్ గోపాల్ వర్మ శిక్షణను ఇచ్చి.. ఎన్టీఆర్ హావభావాలు, మాట్లాడే విధానం.. నడక అన్ని విషయాల్లో స్ట్రాంగ్ ట్రైనింగ్ ఇచ్చి మరీ సినిమా కోసం సిద్దం చేసినట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

 


ఏదో అనుకున్నాం కానీ మొత్తానికి వర్మ ఈ సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టే కనిపిస్తోంది. ఆర్టిస్టుల విషయంలోనే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాడంటే.. సినిమా ఏ రేంజ్ లో చూపిస్తాడో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=zNulrFJpDl4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =