
ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 10


`సాహో` కోసం ఇంటర్నేషనల్ డ్యాన్సర్స్

మహేష్‌తో అనిల్ రావిపూడి చిత్రం?

కాంచన 3 రిలీజ్ డేట్ ఫిక్స్

ఏప్రిల్‌లోనే రానున్న `మహర్షి`

వేసవి నుంచి కళ్యాణ్ రామ్ చిత్రం?

దర్శకుడిగా ఎన్టీరామారావు గొప్ప ఏమిటంటే...!?

తాతగా నటించనున్న నాగార్జున?

భారతీయుడు 2 షూటింగ్ ప్రారంభం

మిఠాయి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సమ్మర్ టార్గెట్‌గా మహేష్, సుకుమార్ చిత్రం?

విక్టరీ వెంకటేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్ డేట్

`ఇస్మార్ట్ శంకర్` రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే...

బాక్సర్‌గా వరుణ్ తేజ్?

మలయాళంలో రిలీజ్ - మంచి టాక్ దక్కించుకున్న ప్రాణ
ఒక సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టిలు ఉంటేనే ఆ సినిమా హిట్టవ్వుద్దా..ఫట్టావ్వుద్దా అన్న గ్యారెంటీ ఉండదు. ఒక్కోసారి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టొచ్చు. ఒక్కోసారి అసలు అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేయోచ్చు. అలాంటి ఉదాహరణలు చెప్పుకోవడానికి ఈ మధ్య చాలా సినిమాలే ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో కేవలం ఒకే ఒక్క పాత్రతో వస్తున్న సినిమా ప్రాణ.

`సాహో` కోసం ఇంటర్నేషనల్ డ్యాన్సర్స్
‘బాహుబలి’ సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా... తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ తెరకెక్కుతోంది. ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో... యాక్షన్ సీక్వెన్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలోని ఓ పాట కోసం ప్రభాస్‌తో కలసి ఇంటర్నేషనల్ డ్యాన్సర్లు లారెంట్ నికోలస్, లారీ నికోలస్‌లు స్టెప్పు లేయనున్నారట. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ ఇద్దరూ కూడా కవలలు కావడం విశేషం. అంతర్జాతీయ పాప్ గాయని…

మహేష్‌తో అనిల్ రావిపూడి చిత్రం?
`పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో హ్యాట్రిక్ డైరెక్టర్ అనిపించుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి... ఈ సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ ప్రధాన పాత్రల్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించిన ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్... సర్వత్రా మంచి వసూళ్ళతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే... నాలుగు వరుస విజయాలతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన అనిల్ రావిపూడి... తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారనే విషయంపై…

కాంచన 3 రిలీజ్ డేట్ ఫిక్స్
2007 లారెన్స్ స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ముని సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాని తరువాత ఆ సినిమాకు సీక్వెల్ గా కాంచన, ఆ తరువాత గంగ సినిమాలు కూడా తెరకెక్కించాడు. ఇప్పుడు కాంచన 3 సినిమాతో మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ ఏడాది సమ్మర్ లో అంటే ఏప్రిల్ 18వ తేదీన కాంచన 3 రిలీజ్ చేయనున్నారు.

ఏప్రిల్‌లోనే రానున్న `మహర్షి`
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం `మహర్షి`. ఈ సినిమాతో కథానాయకుడిగా 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, `దిల్` రాజు, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో `అల్లరి` నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజా సమాచారం…

ఆసక్తికరమైన టైటిల్‌తో శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రం
`కొత్త బంగారు లోకం` వంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల... ఆ తరువాత విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్‌లో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` అనే మల్టీస్టారర్ ని రూపొందించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్‌కి ఊపు తెచ్చాడు. అయితే... ఆ తరువాత శ్రీకాంత్ దర్శకత్వంలో వచ్చిన `ముకుంద`, `బ్రహ్సోత్సవం` చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. దాదాపు మూడేళ్ళ విరామం తరువాత ఈ టాలెంటెడ్ డైరెక్టర్... తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు. గీతా ఆర్ట్స్…

వేసవి నుంచి కళ్యాణ్ రామ్ చిత్రం?
`ఉయ్యాలా జంపాలా`, `మజ్ను` చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు విరించి వర్మ. ఈ యువ దర్శకుడు అతి త్వరలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని రూపొందించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా భావోద్వేగాలకు పెద్ద పీట వేసే కథాంశంతో తెరకెక్కనుందని తెలుస్తోంది. వేసవి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడతాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్... యాక్షన్ థ్రిల్లర్…

భారతీయుడు తీయడానికి ఇన్స్ఫిరేషన్ ఏంటో చెప్పిన శంకర్
యూనివర్శల్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1996లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా వృద్ద కమల్ హాసన్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా మళ్లీ ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నామంటేనే చెప్పొచ్చు..భారతీయుడు సినిమా ఎంతలా గుర్తుండిపోయిందో.

లక్ష్మీస్ ఎన్టీఆర్ - ఎన్టీఆర్ ఫస్ట్ లుక్
రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుండే వివాదాలకు కారణమైన ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఏయే అంశాలు చూపిస్తాడబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ సినిమా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన తరువాత నుండే ఉంటుందని సినిమా ప్రారంభమప్పుడే చెప్పడంతో ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో ఎవైనా వివాదాలు తలెత్తాయంటే అది లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన తరువాతే అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆ కుటుంబం బాధ్యత నాదే - రియల్ హీరో అయిన సందీప్ కిషన్
తెలుగు ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను ఎంత అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలను అమితంగా అభిమానించడంలో తెలుగు ప్రజల తరువాతే ఎవరైనా. వారి అభిమానానికిి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అలాగే హీరోలు కూడా తమ అభిమానుల పట్ల అంతే ప్రేమను చూపిస్తుంటారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా? అసలు సంగతేంటంటే...

దర్శకుడిగా ఎన్టీరామారావు గొప్ప ఏమిటంటే...!?
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు దివికేగి నేటికి 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1923 మే 28న జన్మించిన ఎన్టీ రామారావు1996 జనవరి 18 న తనువు చాలించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తన విశిష్ట విలక్షణ అభినయ చాతుర్యంతో అలరించి తెలుగువారి జీవన విధానంలో ఒక అంతర్భాగంగా మమేకమైన ఆ మహానటుడి మహాభినిష్క్రమణం తెలుగు వారందరికీ ఓ శరాఘాతమే.

తాతగా నటించనున్న నాగార్జున?
నాగార్జున కథానాయకుడిగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా సినిమా.2016 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈసినిమాలో బంగార్రాజు పాత్రలో నటించిన నాగార్జున నటనకు మంచి మార్కులు పడ్డాయి. నిజం చెప్పాలంటే 'బంగార్రాజు' పాత్రే సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. దాంతో ఆ పాత్ర పేరుతోనే ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు నాగార్జున, కళ్యాణ్ కృష్ణ.

భారతీయుడు 2 షూటింగ్ ప్రారంభం
గతంలో శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘భారతీయుడు’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన కమల్ హాసన్ నటనను ఎవరు మరిచిపోలేదు. ముఖ్యంగా వృద్ద కమల్ హాసన్ పాత్ర ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

మిఠాయి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, రవివర్మ, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా `మిఠాయి`. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు మనకు అందిస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ను మన ముందుకు తీసుకొచ్చారు. అదేంటంటే..ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫిబ్రవరి 22వ తేదీన `మిఠాయి` సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు.

ఏప్రిల్ నుంచి బాలకృష్ణ, బోయపాటి చిత్రం?
నటసింహ నందమూరి బాలకృష్ణకి కలిసొచ్చిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `సింహా`, `లెజెండ్` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అంతేకాదు... ఈ రెండు సినిమాలతో `ఉత్తమ నటుడు`గా `నంది` అవార్డులను కూడా అందుకున్నారు బాలయ్య. అలా... బాలకృష్ణకు గుర్తుండిపోయే కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన బోయపాటి... త్వరలోనే హ్యాట్రిక్ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా... `సింహా` తరహాలో ఉంటుందని... ఆ చిత్రంలోలాగే బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. తొలుత... హ్యాట్రిక్…

సమ్మర్ టార్గెట్‌గా మహేష్, సుకుమార్ చిత్రం?
`1 నేనొక్కడినే` తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని తెలుస్తోంది. జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ సినిమాని... 2020 వేసవికి విడుదల చేయనున్నారని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇదిలా ఉంటే... ప్రస్తుతం మహేష్ తన 25వ చిత్రం `మహర్షి`తో ఫుల్ బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి…

విక్టరీ వెంకటేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్ డేట్
`ఎఫ్ 2` ఘనవిజయం... సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. `గురు` వంటి విజయవంతమైన చిత్రం తరువాత... 21 నెలల గ్యాప్ అనంతరం వచ్చిన `ఎఫ్ 2`... వెంకీ కెరీర్‌లో మరపురాని విజయాలలో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక వైపు ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే... మరో వైపు తదుపరి చిత్రాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు ఈ మోస్ట్ టాలెంటెడ్ హీరో. తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి నటించనున్న `వెంకీ మామ` త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్ళనుండగా... అదే సమయంలో సోలో హీరోగా మరో ప్రాజెక్ట్‌ను కూడా సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు…

`ఇస్మార్ట్ శంకర్` రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే...
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఇస్మార్ట్ శంకర్` పేరుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరీ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరీ జగన్నాథ్‌తో కలసి కథానాయిక ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతమందించనున్నాడు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ నెల 23న ప్రారంభం కానున్నాయని... అలాగే రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24 నుంచి మొదలుకానుందని టాలీవుడ్ టాక్. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి... వేసవి సందర్భంగా మే నెలలో `ఇస్మార్ట్ శంకర్`ని విడుదల…

బాక్సర్‌గా వరుణ్ తేజ్?
సంక్రాంతి కానుకగా విడుదలైన `ఎఫ్ 2`తో తన ఖాతాలో మరో విజయాన్ని జమ చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సీనియర్ హీరో వెంకటేష్ కాంబినేషన్‌లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే... తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు వరుణ్. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు రూపొందించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు... ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనుండగా... అతని కోచ్‌గా సీనియర్ హీరో అర్జున్ నటించనున్నాడని టాక్. బాక్సర్ పాత్ర కోసం ఇప్పటికే వరుణ్ ప్రత్యేక…

ఎల్.వి.ప్రసాద్ 111వ జయంతి ఉత్సవం లో నందమూరి బాలకృష్ణ
ఈరోజు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ (ఎల్.వి ప్రసాద్) 111వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో 111వ జయంతి ఉత్సవం నిర్వహించారు. ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని.. నందమూరి బాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, దర్శకులు, నటులు పాల్గొని ఎల్.వి ప్రసాద్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు.