వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. గత ఏడాది `మహానటి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` చిత్రాలతో ఘనవిజయాలను తన ఖాతాలో జమచేసుకున్న ఈ యూత్ ఐకాన్… ప్రస్తుతం నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న `డియర్ కామ్రేడ్`లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే… ఇదే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమాని కూడా చేయడానికి విజయ్ దేవరకొండ ఒప్పందం కుదుర్చుకున్నాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు… ఈ చిత్రానికి దర్శకుడు కూడా కన్‌ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ దర్శకుడు మరెవరో కాదు… వరుణ్ తేజ్ హీరోగా `తొలిప్రేమ` వంటి ఆహ్లాదభరితమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన వెంకీ అట్లూరి. ఇప్పటికే… వెంకీతో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం… వెంకీ అట్లూరి చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా ఉంటోందని సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది. కాగా… అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి రూపొందించిన తాజా చిత్రం `Mr. మజ్ను` ఈ నెల 25న విడుదల కానుంది.
[youtube_video videoid=1ZLTAIfJzvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: