వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పై గత కొద్దిరోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్ లో ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల చేస్తున్నట్టు ముందు తెలిపినా..ఆతరువాత రిలీజ్ డేట్ వాయిదా పడిందని..ఏప్రిల్ 25వ తేదీన మహర్షి సినిమాను రిలీజ్ చేయాలన్న యోచనలో చిత్రయూనిట్ ఉందని టాక్స్ వినిపించాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో చిన్న కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు అందరూ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కు తెర దింపారు దిల్ రాజు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం కోసం తిరుమలకి వెళ్లిన దిల్ రాజు ‘మహర్షి’ సినిమా డేట్ ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాతో పాటు ఈ ఏడాది మరో నాలుగు సినిమాలు క్యూలో ఉన్నాయని చెప్పారు.
మరి ఇదే ఏప్రిల్ లో పలు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. నాగచైతన్య మజిలీ
సినిమా ఏప్రిల్ 5 వ తేదీన, లారెన్స్ కాంచన 3 ఏప్రిల్ 18 వ తేదీన, నాని జెర్సీ ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. ఆ తరువాత వారం మహర్షి సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో మరి మహర్షి సినిమాకు ఎలాంటి అడ్డులేదనే చెప్పొచ్చు. ఒకవేళ ఆ మూడు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అయినా దాదాపు వారం గ్యాప్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం ఉండదని చెప్పొచ్చు. చూద్దాం మరి అభిమానులు పెంచుకున్న అంచనాలను మహర్షి ఎంత వరకూ రీచ్ అవుతాడో..!
కాగా ఈ సినిమాలో మహేశ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, మహేష్ స్నేహితుడిగా కీలకమైన పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడు. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=Brd1RdYsiR0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: