ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న యువ దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. `పటాస్`తో మొదలైన ఈ యంగ్ డైరెక్టర్ జైత్రయాత్ర `ఎఫ్ 2` వరకు కొనసాగుతూనే ఉంది. కాగా… అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా `పటాస్` సరిగ్గా నాలుగేళ్ళ క్రితం ఇదే జనవరి 23న విడుదలై… సూపర్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. కట్ చేస్తే… నాలుగేళ్ళ తన ప్రయాణంలో నాలుగు చిత్రాలతో ఈ దర్శకుడు బాక్సాఫీస్ ఫేవరేట్ అయిపోయాడు. `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`… ఇలా జానర్ ఏదైనా… ఎంటర్‌టైన్‌మెంట్‌నే తన ప్రధాన అస్త్రంగా చేసుకుని తనదైన శైలితో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. వినోదాన్నే నమ్ముకుని… వరుస విజయాలు అందుకుంటున్న ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మున్ముందు మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటోంది `ద తెలుగు ఫిల్మ్‌నగర్.కామ్`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=URxKw7MgD9k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: