శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన మల్టీ స్టారర్ F2 ఫన్ &ఫ్రస్టేషన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సంక్రాంతి బరిలో దిగిన సినిమాలలో నెంబర్ 1 గా F2 మూవీనిలిచింది. కామెడీ ఎంటర్ టైనర్ గా
రూపొందిన F2 మూవీ ప్రేక్షకాదరణ పొంది, 2వారాలలోనే 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2019 సంవత్సరంలో 100కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిత్రం గా F2 మూవీ రికార్డ్ నెలకొల్పింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ కు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుందని ఈ సినిమా నిరూపించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన F2 మూవీ లో తమన్నా, మెహరీన్ కథానాయికలు. ఓవర్ సీస్ లో కూడా 1మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. రిలీజయిన రెండు వారాలకే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన F2 మూవీ, ఫుల్ రన్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచిచూడాల్సిందే.
[youtube_video videoid=fk-BAn6cRw4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: