అల్లుడితో సందడి చేయడానికి రెడీ అవుతున్న మామ

Venky Mama Regular Shoot To Kickstart Soon,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Venky Mama Movie Shoot Starts Soon,Venky Mama Movie Latest News,Venkatesh and Naga Chaitanya Venky Mama Movie Shoot News,Venky Mama Movie Shooting Updates,Venky Mama Telugu Movie Shooting Details
Venky Mama Regular Shoot To Kickstart Soon

విక్టరీ వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దర్శక నిర్మాతలకు మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఇక ఇదే ఫామ్ లో వెంకీ మరో మల్టీస్టారర్ కు రెడీ అయిపోతున్నాడు. కె యస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో వెంకీ, నాగచైతన్య కాంబినేషన్ లో వెంకీమామ అనే మల్టీస్టారర్ తెరెకెక్కనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరుపుకోగా.. తాజాగా షూటింగ్ డేట్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఫిబ్రవరి 21న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెంకీమామలో, చైతన్యకి జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా, వెంకీ పక్కన శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లు వినబడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=YGvYS-pTa3Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − nineteen =