పలు సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొంది, జనరంజక పాలనచేసి, ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహా నేత, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మహేష్ వి రాఘవ్ దర్శకత్వంలో స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా రూపొందిన యాత్ర మూవీ ఫిబ్రవరి 8వ తేదీ తెలుగు, తమిళ, మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. 1500KM పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకున్న YSRబయోపిక్ మూవీ రాజకీయ చిత్రంతో పాటు హ్యూమన్ డ్రామా కలగలిపిన చిత్రం యాత్ర అని దర్శకుడు మహి తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాత్ర మూవీ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి 2దశాబ్దాల తరువాత తెలుగు లో నటించిన చిత్రం యాత్ర. YSR హావభావాలను మమ్ముట్టి పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేయడం, తెలుగు నేర్చుకుని డైలాగ్స్ చెప్పడం విశేషం. యాంకర్, నటి అనసూయ ఒక పొలిటీషియన్ పాత్రలో నటించడం, K సంగీత దర్శకత్వంలో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి యాత్ర మూవీ లో అన్ని గీతాలను
అర్ధవంతంగా, ఎమోషనల్ గా ఉండేలా గీత రచన చేయడం వంటి ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. 70ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొంది న యాత్ర మూవీ కి సమర్పణ శివ మేక, నిర్మాతలు విజయ్ చిల్లా,శశిదేవిరెడ్డినిర్మాతలు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన యాత్ర మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
[youtube_video videoid=-0DlUtky8NA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: