మాస్ ఎంటర్‌టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుల్లో మాస్ మహరాజ్ రవితేజ ఒకరు. తన శైలి నటనతో… బ్యాంకబుల్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో… కెరీర్‌లో సింహభాగం విజయాలను అందుకున్నాడు. అయితే… గత కొంతకాలంగా రవితేజ కెరీర్ గ్రాఫ్ ఏమంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఒక దశలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన… కొన్ని రొటీన్ సినిమాలతో అనూహ్యంగా అపజయాల బాట పట్టాడు. అయితే… డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో తెరకెక్కిన `రాజా ది గ్రేట్`తో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేశాడాయన. ఇందులో అంధుడి పాత్రలో రవితేజ అభినయం అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులను అలరించింది. అయితే… ఆ తరువాత వచ్చిన `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమర్ అక్బర్ ఆంటొని` ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో… తదుపరి చిత్రం `డిస్కో రాజా` ఫలితం కీలకంగా మారింది. సైంటిఫిక్ ఫిక్షన్‌గా తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ డ్రామాలో రవితేజ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడని టాక్. పేరులో `రాజా` ఉండడం… మరోమారు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తుండడం… వంటి అంశాలు `డిస్కో రాజా`కు కూడా కలిసొచ్చి… రవితేజ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి. వరుస పరాజయాలతో ఉన్నప్పుడు `రాజా ది గ్రేట్` ఎలాగైతే రవితేజకి సక్సెస్ అందించిందో… అదే విధంగా `డిస్కో రాజా` కూడా హిట్ ట్రాక్‌లోకి తీసుకువస్తుందని మాస్ మహరాజ్ అభిమానులు ఆశిస్తున్నారు. కాగా… ఈ ఏడాది ద్వితీయార్ధంలో `డిస్కో రాజా` తెరపైకి రానుంది.
[youtube_video videoid=otdGhg81P4M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: