ఒక మనసు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నిహారిక ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకొని మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నటించి మరోసారి అలరించింది. అయితే ఆ సినిమా అంతగా అలరించలేదనే చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా ప్రణీత్ దర్శకత్వంలో నిహారిక సూర్యకాంతం అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా ఖచ్చితంగా మంచిగానే ఉండబోతుందన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయారు చిత్రయూనిట్. కాగా ప్రణీత్ బ్రమందపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంట గా నటిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పణ లో రూపొందుతున్న ఈ సినిమాను నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై సందీప్ యెర్రంరెడ్డి నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=UZq_r5DUy9I]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: