యువ కథానాయకుడు శర్వానంద్ ఈ ఏడాది రెండు చిత్రాలతో సందడి చేయనున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న పేరు నిర్ణయించని సినిమా వేసవిలో విడుదల కానుండగా… తమిళ బ్లాక్‌బస్టర్ `96`కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది. ఈ రెండు సినిమాల తరువాత మరో ఆసక్తికరమైన సినిమాకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `కార్తికేయ`, `ప్రేమమ్`, `సవ్యసాచి` చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు చందు మొండేటి… ఇటీవల శర్వానంద్‌కు ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పాడని… అది నచ్చడంతో సదరు యంగ్ హీరో ఈ ప్రాజెక్ట్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అలాగే`పడి పడి లేచే మనసు` నిర్మాతలలో ఒకరైన సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని టాలీవుడ్ టాక్. అంతేకాదు… `పడి పడి లేచే మనసు` బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించకపోవడంతో… తన వంతు బాధ్యతగా నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తక్కువ పారితోషికంలోనే శర్వా చేయబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే శర్వా, చందు సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చు.
[youtube_video videoid=vkbvnJ1CfCA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: