రకుల్ ప్రీత్ సింగ్… ఈ తరం ప్రేక్షకుల కలల రాణి. దక్షిణాదిలోనే కాదు… హిందీ పరిశ్రమలోనూ తనదైన శైలితో ముందుకు సాగుతోందీ స్టన్నింగ్ బ్యూటీ. ఈ ఏడాదిలో వరుస చిత్రాలతో సందడి చేయబోతున్న ఈ ముద్దుగుమ్మకి… ఈ వాలంటైన్స్ డే వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే… అదే రోజు కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తితో కలసి `డబుల్ ధమాకా` ఇవ్వబోతోంది రకుల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `ఖాకి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తితో కలసి రకుల్ ప్రీత్ నటించిన ట్రావెల్ లవ్ స్టోరీ `దేవ్` తెలుగు, తమిళ భాషల్లో ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఇక అదే రోజున సూర్యతో కలసి రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా నటించిన `ఎన్జీకే` సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాబోతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించబోతోంది. మొత్తమ్మీద… ఈ ప్రేమికుల రోజున అన్నదమ్ములైన సూర్య, కార్తి కాంబినేషన్‌లో… అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనుందన్నమాట రకుల్. ఈ రెండు సినిమాలతోనూ రకుల్‌కి మంచి విజయాలు దక్కాలని ఆకాంక్షిద్దాం.
[youtube_video videoid=LMYFouzOOjo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: