శతాధిక చిత్రాలు, దశాధిక రంగాలు, దశముఖ ప్రతిభా విశేషాల సినీ శిఖరం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అనూహ్య, ఆకస్మిక మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.2017 మే 30 వ తేదీన ఆ దర్శక దిగ్గజం పరమపదించారు. అటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, ఇటు తెలుగు ప్రజానీకం మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు స్వస్థలం పాలకొల్లు. దాసరి నారాయణ రావు తో పాటు ఎందరెందరో సినీ దిగ్గజాల పురిటిగడ్డ పాలకొల్లు. అందుకే పాలకొల్లులో పుట్టి ఆ ఊరికే గర్వకారణంగా నిలిచిన ప్రముఖుల విగ్రహాలను ఆ పట్టణం నడిబొడ్డున ప్రతిష్టించారు. ఇప్పుడు తాజాగా శతాధిక చిత్ర దర్శకుడిగా పాలకొల్లు ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన దాసరి నారాయణరావు కాంస్య విగ్రహాన్ని పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ లో
ప్రతిష్టించేందుకు సన్నాహాలు జరిగాయి . రేపు జనవరి 26, సాయంత్రం ఐదు గంటలకు దాసరి ప్రియ శిష్యుడు ఆయనతో విశేషమైన అనుబంధం కలిగిన ప్రముఖ నటులు, నిర్మాత, విద్యావేత్త డాక్టర్ మంచు మోహన్ బాబు చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని “దాసరి కాంస్య విగ్రహావిష్కరణ కమిటీ” తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డాక్టర్ మోహన్ బాబుతో పాటు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ హీరో శ్రీకాంత్, నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు వి.వి.వినాయక్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, ధవళ సత్యం, మారుతి, సీనియర్ హీరోయిన్స్ ప్రభ, కవితతో పాటు దాసరి కుటుంబ సభ్యులు ఇంకెందరో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు.
[youtube_video videoid=lhw0_z3I0bk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: