తెలుగు నాట చాలా కాలం తరువాత సిసలైన మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. అదే `ఆర్ ఆర్ ఆర్` (వర్కింగ్ టైటిల్). యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ అధినేత డీవీవీ దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా… ఇప్పటికే ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసుకోగా… తాజాగా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ముగ్గురు హీరోయిన్లకు స్థానమున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు కథానాయికలుగా ఎవరు నటిస్తున్నారనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం… బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ హీరోయిన్‌గా ఎంపికైందని తెలిసింది. చరణ్‌కి జోడీగా ఈ ముద్దుగుమ్మ నటించబోతున్నట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయమేమిటంటే… చరణ్ తొలి హిందీ చిత్రం `జంజీర్`లో ప్రియాంక చోప్రా కథానాయికగా నటించింది. మళ్ళీ ఇప్పుడు ఆమె చెల్లెలు పరిణీతి చోప్రా పేరు చరణ్ కొత్త చిత్రంలో వినిపించడం విశేషం. త్వరలోనే పరిణీతి ఎంట్రీపై క్లారిటీ రావచ్చు. 2020 వేసవికి `ఆర్ ఆర్ ఆర్` తెరపైకి రానుంది.
[youtube_video videoid=5oGd04I7hYY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: