`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఫిబ్రవరి 14న పట్టాలెక్కనుందని సమాచారం. ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో… బన్నీకి జోడీగా ఓ స్టార్ హీరోయిన్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు… `జులాయి`లో ఇలియానా, `సన్నాఫ్ సత్యమూర్తి`లో సమంత ఎలాగైతే తొలిసారిగా అల్లు అర్జున్‌తో జోడీ కట్టారో… అదే తరహాలో ఓ ఫ్రెష్ కాంబినేషన్‌లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు. ఇప్పటికే కథానాయిక ఎంపిక ప్రక్రియ మొదలైందని… త్వరలోనే హీరోయిన్ ఫైనలైజ్ అవుతుందని టాలీవుడ్ టాక్. కాగా… శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసి అక్టోబర్‌లో ఈ సినిమాని విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=tYm_pbS65_Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: