`శతమానం భవతి`(2017)తో తెలుగు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ సినిమా… పలు పురస్కరాలను అందుకుంది. దర్శకుడిగా సతీష్‌కు ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. అయితే… `శతమానం భవతి` తరువాత సతీష్ రూపొందించిన మరో ఫ్యామిలీ డ్రామా `శ్రీనివాస కళ్యాణం` ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో… తదుపరి చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి రావడానికి మరో ఎమోషనల్ డ్రామాని ఎంచుకున్నాడట ఈ టాలెంటెడ్ డైరెక్టర్. `ఆల్ ఈజ్ వెల్` పేరుతో రూపొందనున్న ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా నిర్మించనున్నట్టు సమాచారం. ఇక… ఈ చిత్ర కథానాయకుడు ఎవరనే విషయం మరో వారం రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చు. టైటిల్‌కు తగ్గట్టే సతీష్‌కి ఈ చిత్రం `వెల్` రిజల్ట్ ఇవ్వాలని ఆశిద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=IeYdA2yha58]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: