
ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 15


మరోసారి రిపీట్ చేసిన అనిల్ రావిపూడి

మహేష్ కి జోడీగా బాలీవుడ్ భామ?

వెంకటేష్... సంక్రాంతి హిట్ సినిమాల సెంటిమెంట్

జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ

మణికర్ణిక తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ చరణ్ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమాలు

ఏప్రిల్‌లో యువ హీరోల సందడి

మ్యూజికల్ హిట్ `అదృష్టవంతులు`కి 50 ఏళ్ళు

అనుపమ రిపీట్ చేస్తుందా?

పేట ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు

`సర్వం తాళమయం` రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ కొత్త చిత్రంలో 18 మంది హీరోయిన్లు...?

శాండల్ వుడ్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర 50వ సినిమా
డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ గా శాండల్ వుడ్ లో ప్రవేశించిన ఉపేంద్ర 1992 సంవత్సరంలో దర్శకుడి గా మారి తన 25 సంవత్సరాల సినీ కెరీర్ లో 10 సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా 45 సినిమాలకు పైగా నటించారు. నటుడు, దర్శకుడు ఉపేంద్ర, ఓంకారం, రా, ఉపేంద్ర, కన్యాదానం, s/o. సత్యమూర్తి వంటి మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

మరోసారి రిపీట్ చేసిన అనిల్ రావిపూడి
`పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా... ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తదుపరి చిత్రం `F2` ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సోలో హీరో సబ్జెక్ట్‌లనే డీల్ చేసిన అనిల్.. తొలిసారిగా ఈ సినిమా కోసం మల్టీస్టారర్ సబ్జెక్ట్ ని టేకప్ చేయడం విశేషం. వెంకటేష్, వరుణ్ తేజ్ తొలిసారిగా కలసి నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఉంది. ఇదిలా ఉంటే... అనిల్ చిత్రాలను పరిశీలిస్తే ఓ విషయం స్ఫష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే... తన గత చిత్రాల్లోని కథానాయిలను…

మహేష్ కి జోడీగా బాలీవుడ్ భామ?
సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా... త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం... ఆ పాత్రలో ఓ బాలీవుడ్ భామ నటించబోతుందని సమాచారం.

వెంకటేష్... సంక్రాంతి హిట్ సినిమాల సెంటిమెంట్
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ నుంచి గత చిత్రం ‘గురు’ వరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించడమే కాకుండా... పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ సీనియర్ హీరో. ఇదిలా ఉంటే... ఇప్పటివరకు సంక్రాంతి సీజన్‌లో వెంకీ కథానాయకుడిగా నటించిన 14 చిత్రాలు విడుదల కాగా... వాటిలో ఐదు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అంతేకాదు... సంక్రాంతి సీజన్‌లో సక్సెస్ అయిన ఈ సినిమాలన్నింటిలోనూ ఓ ఆసక్తికరమైన అంశం కూడా దాగి ఉంది. అదేమిటంటే... ఆ యా చిత్రాల్లో నటించిన కథానాయికలంతా వెంకటేష్‌తో కలిసి తొలిసారిగా నటించిన వారే కావడం విశేషం.

జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ
తమిళ ప్రజలు "అమ్మ "గా ఆరాధించే జయలలిత తెలుగు,తమిళ సినిమాలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించి, రాజకీయాలలో ప్రవేశించి తమిళ నాడు ముఖ్యమంత్రి గా ఎదిగారు. పేద ప్రజలకు మేలుకలిగేలా అనేక పథకాలు అమలు పరిచారు. తమిళనాడు లో లక్షలాది అభిమానులు ఉన్న దివంగత ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ ని ముగ్గురు తమిళ దర్శకులు అనౌన్స్ చేశారు. ప్రియదర్శిని దర్శకత్వం లో నిత్యా మీనన్ , ఏ ఎల్ విజయ్ దర్శకత్వం లో విద్యా బాలన్ లేదా నయనతార జయలలిత క్యారెక్టర్ లో నటించనున్నారు. ప్రముఖ సీనియర్ దర్శకుడు భారతీ రాజా జయలలిత బయోపిక్ మూవీ రూపొందించనున్నట్టు ప్రకటించారు.

మణికర్ణిక తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా కంగనా ప్రధాన పాత్రలో మణికర్ణిక సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదట ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా.. ముగింపు మాత్రం కంగనా చేతుల మీదగానే జరిగింది. ఇక ఇటీవలే ఈ సినిమా హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా దానిలో కంగానే తన విశ్వరూపం చూపిందన్న ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ డేట్ ను ఫిక్స్ చేశారు. రేపు (1-4-2018) ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

రామ్-పూరీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
ఎలాగైనా సరే ఓ మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఎలాగైనా సరే ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు రామ్. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేయనున్నారు. పూరీ కాబట్టి.. తక్కువ టైంలో సినిమాలో కంప్లీట్ చేయడంలో ఎక్స్ పర్ట్ కాబట్టి రీలజ్ చేసేయొచ్చు. ఇక అలా సినిమా అనుకున్నారో లేదో...ఎలాంటి నాన్చుడు లేకుండా సినిమా ఫస్ట్ లుక్ ను... టైటిల్ ను రిలీజ్ చేసేశారు.

మరో రెండు కొత్త సినిమాలు లాంచ్ చేయనున్న దిల్ రాజు
టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు కూడా ఒకరని చెప్పొచ్చు. ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ..టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు లిస్ట్ లు ఉండగా మరో రెండు సినిమాలు ఆ లిస్ట్ లో వచ్చి చేరాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 2 సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఎఫ్2 చిత్రం వినోదాత్మకంగా వుంటుందనే నమ్మకం కలిగించడంతో ఈ చిత్రం పట్ల పాజిటివిటీ నెలకొంది. ఇక మహేష్ ఇరవై అయిదవ చిత్రమైన మహర్షి వుండనే వుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.

రామ్ చరణ్ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే
బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. సంక్రాంతి పండుగ కానుకగా ఈసినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే రామ్ చరణ్ లుక్ ను చూశాం కదా. రామ్ చరణ్ మామూలు ఫిట్ నెస్ గా లేడు. చెర్రీ బాడీని చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. నిజానికి రామ్ చరణ్ ఎప్పుడూ ఫిట్ గానే ఉంటాడు. కానీ ఈ సినిమాలో ఉన్న బాడీకి..ఇంతకు ముందు సినిమాల్లో ఉన్న బాడీకి చాలా డిఫరెన్స్ ఉంది. బోయపాటి చెర్రీని అలా చూపించాడు. ముఖ్యంగా ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్‌లో చెర్రీ బాడీని ఎలివేట్ చేస్తూ బాగా చూపించాడు. మరి బోయపాటి అలా చూపించాడంటే చెర్రీ తన బాడీని అలా…

యాత్ర మూవీ - జగ్గూభాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్
‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా..ఇప్పటికే మమ్ముట్టి ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో కీలక వ్యక్తి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమాలు
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శ్రీను మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బెల్లంకొండ నటించిన స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం వంటి భారీ బడ్జెట్ సినిమాలు క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. కొత్త హీరో అయినా బెల్లంకొండ శ్రీనివాస్ స్టార్ హీరోయిన్స్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ లతో ఆడి పాడడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ తో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

ఏప్రిల్‌లో యువ హీరోల సందడి
వేసవిలో విడుదలయ్యే సినిమాలకు కమర్షియల్‌గా మంచి మైలేజ్ ఉంటుంది. యావరేజ్ టాక్ వచ్చినా... సీజన్ అడ్వాంటేజ్‌తో బ్లాక్‌బస్టర్ అయిన సినిమాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇక ఈ వేసవిలో ముఖ్యంగా... ఏప్రిల్ నెలలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే... సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 25వ చిత్రం `మహర్షి`ని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే నెలలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ` కూడా విడుదలకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 19న ఈ సినిమాని…

మ్యూజికల్ హిట్ `అదృష్టవంతులు`కి 50 ఏళ్ళు
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ ది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. రాజేంద్రప్రసాద్ నిర్మాణంలోనూ... అలాగే దర్శకత్వంలోనూ ఏఎన్నార్ నటించిన పలు చిత్రాలు కమర్షియల్‌గా రాణించడమే కాదు... మ్యూజికల్‌గానూ మెప్పించాయి. రాజేంద్రప్రసాద్ నిర్మాణంలో... `ఆరాధన`, `ఆత్మ బలం`, `అంతస్థులు`, `ఆస్తిపరులు` వంటి మ్యూజికల్ సెన్సేషన్స్ తరువాత ఏయన్నార్ హీరోగా వచ్చిన చిత్రం `అదృష్టవంతులు`. వి.మధుసూదన రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఏయన్నార్‌కి జోడీగా జయలలిత నటించగా... ఇతర ముఖ్య పాత్రల్లో జగ్గయ్య, గుమ్మడి, రేలంగి, ప్రభాకర్ రెడ్డి…

నాలుగోసారి డబుల్ ధమాకా ఇస్తున్న దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్... దాదాపు రెండు దశాబ్దాలుగా స్వరకర్తగా రాణిస్తున్న యువ సంగీత దర్శకుడు. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్‌లతో అలరిస్తున్న ఈ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్... ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో అభిమానులను పలకరించనున్నాడు. ఆ చిత్రాలే... `వినయ విధేయ రామ`, `ఎఫ్ 2`. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన `వినయ విధేయ రామ` ఈ నెల 11న రిలీజ్ కానుండగా... విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన `ఎఫ్ 2` ఈ నెల 12న తెరపైకి రానుంది. అంటే... ఈ సంక్రాంతికి డీఎస్పీ డబుల్ ధమాకా ఇవ్వనున్నాడన్నమాట.

అనుపమ రిపీట్ చేస్తుందా?
చేసింది తక్కువ సినిమాలే అయినా... కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్. మలయాళ చిత్రం `ప్రేమమ్`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ... మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమా తీసుకువచ్చిన గుర్తింపుతో తెలుగు, తమిళ భాషల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంది. అంతేకాదు.. మలయాళ చిత్ర పరిశ్రమ తరహాలోనే తెలుగులో నటించిన తొలి చిత్రం `అఆ`తోనూ... తమిళంలో నటించిన మొదటి సినిమా `కొడి`తోనూ విజయాలను ఒడిసిపట్టుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ... మరో దక్షిణాది భాషలో ఎంట్రీ ఇస్తోంది.

రామ్-పూరీ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ అప్ డేట్
ఎనర్జిటిక్ హీరో రామ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో సెట్స్ పైకి వెళ్ల నున్న ఈ సినిమా మే లో రిలీజ్ చేయబోతున్నట్టు ముందే చెప్పేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది ఛార్మీ. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రేపుసాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపింది ఛార్మీ.

యాత్ర సాంగ్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన వందేమాతరం శ్రీనివాస్
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది గాయకులు ఉన్నారు..ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నారు కానీ.. విప్లగీతాలకు ప్రాణం పోసింది మాత్రం ఒక్క వందేమాతరం శ్రీనివాస్ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. వందేమాతరం సినిమాలో తరం మారుతున్నది, స్వరం మారుతున్నది అంటూ వందేమాతరం గీతానికి కొత్త అర్థం చెప్పి ఆ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్న సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు, నటుడు, దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్. ఆయన కెరీర్లో ఎన్నో విప్లవ గీతాలు, ఎన్నో ఉద్యమ గీతాలను వినిపించారు. ఎర్రజెండెర్రజెండ ఎన్నియలో.. అంటూ విప్లవగీతాలను ఆలపించడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఆయన పాటలు వింటే ఎక్కడలేని ధైర్యం రావాల్సిందే...ఆయన పాటలు…

పేట ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో రజినీ లుక్ ను చూసి అందరూ ఫిదా అవుతుండగా..ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలతో ,రజినీ మార్క్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉండడంతో ఈ సినిమా సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీనిచ్చేలా ఉందంటున్నారు.

`సర్వం తాళమయం` రిలీజ్ డేట్ ఫిక్స్
`మెరుపు కలలు`, `ప్రియురాలు పిలిచింది`... మూడున్నరేళ్ళ గ్యాప్‌లో వచ్చిన ఈ రెండు తమిళ అనువాద చిత్రాలు మ్యూజికల్ గా సెన్సేషన్ సృష్టించాయి. ఈ మ్యూజికల్ హిట్స్ కి సంబంధించిన కామన్ ఫ్యాక్టర్... ఎ.ఆర్.రెహమాన్ సంగీతం, రాజీవ్ మీనన్ దర్శకత్వం. తెలుగు చిత్రం `చైతన్య`తో సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్‌ని మొదలుపెట్టి... ఆ తరువాత `బొంబాయి` తదితర సినిమాల్లోని తన పనితనంతో భారతీయ ప్రేక్షకుల మనసును దోచుకున్నారు ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్. `మెరుపు కలలు`తో దర్శకుడిగా టర్న్ అయిన రాజీవ్... `ప్రియురాలు పిలిచింది`తోనూ మంచి మార్కులు పొందారు. దాదాపు 18 ఏళ్ళ తరువాత ఈ టాలెంటెడ్…

విజయ్ కొత్త చిత్రంలో 18 మంది హీరోయిన్లు...?
`మెర్సల్` (అదిరింది), `సర్కార్` చిత్రాలతో రెండు వరుస ఘనవిజయాలను అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్... ప్రస్తుతం `రాజా రాణి` ఫేమ్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `తెరి`(పోలీస్), `మెర్సల్` తరువాత విజయ్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో... తమిళనాట ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. నయనతార ఓ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఏకంగా 18 మంది హీరోయిన్లు నటించనున్నారని సమాచారం.