మ‌రోసారి రిపీట్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi Repeats The Same Sentiment For F2 Also,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Director Anil Ravipudi Next Movies Details,F2 Telugu Movie Latest News,Anil Ravipudi Repeats The Sentiment For F2,Anil Ravipudi Latest Movies News
Anil Ravipudi Repeats The Same Sentiment For F2 Also

`ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్నాడు యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. కాగా… ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ త‌దుప‌రి చిత్రం `F2` ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు సోలో హీరో స‌బ్జెక్ట్‌ల‌నే డీల్ చేసిన అనిల్‌.. తొలిసారిగా ఈ సినిమా కోసం మ‌ల్టీస్టార‌ర్ స‌బ్జెక్ట్‌ ని టేక‌ప్ చేయ‌డం విశేషం. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ తొలిసారిగా క‌లసి న‌టించిన ఈ సినిమాపై ఇప్ప‌టికే ట్రేడ్ వ‌ర్గాల్లో మంచి బ‌జ్ ఉంది. ఇదిలా ఉంటే… అనిల్ చిత్రాల‌ను ప‌రిశీలిస్తే ఓ విష‌యం స్ఫ‌ష్టంగా అర్థ‌మవుతుంది. అదేమిటంటే… త‌న గ‌త చిత్రాల్లోని క‌థానాయిల‌ను నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కు ఏదో రూపంలో రిపీట్ చేస్తుండ‌డం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే.. అనిల్ రావిపూడి తొలి చిత్రం `ప‌టాస్‌`లో హీరోయిన్‌గా న‌టించిన శ్రుతి సోథి… రెండో చిత్రం `సుప్రీమ్‌`లో త‌ళుక్కున మెర‌వ‌గా… ఇక రెండో సినిమా `సుప్రీమ్‌`లో క‌థానాయిక‌గా న‌టించిన రాశీ ఖ‌న్నా.. మూడో చిత్రం `రాజా ది గ్రేట్`లో గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇచ్చింది. అలాగే మూడో చిత్రం `రాజా ది గ్రేట్‌`లో నాయిక‌గా న‌టించిన మెహ‌రీన్‌… నాలుగో సినిమా `F2`లో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఒక‌రిగా న‌టిస్తోంది. యాదృచ్ఛికంగా జ‌రుగుతున్న విష‌య‌మో… లేదంటే అనిల్ సెంటిమెంట్ గా ఫీల్ అయి ఇలా రిపీట్ చేస్తున్నాడో తెలియ‌దు కానీ… ఈ ఫార్ములా అయితే ఇప్ప‌టివ‌ర‌కు బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. మ‌రి… ఈ సెంటిమెంట్ ప్ర‌కారం… రాబోయే చిత్రంలో త‌న నాలుగో చిత్ర క‌థానాయిక‌ త‌మ‌న్నాని గెస్ట్ రోల్‌లోనో లేదంటే హీరోయిన్‌గానో అనిల్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=2F4DHcfKDHY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + six =