`మెరుపు కలలు`, `ప్రియురాలు పిలిచింది`… మూడున్నరేళ్ళ గ్యాప్‌లో వచ్చిన ఈ రెండు తమిళ అనువాద చిత్రాలు మ్యూజికల్ గా సెన్సేషన్ సృష్టించాయి. ఈ మ్యూజికల్ హిట్స్ కి సంబంధించిన కామన్ ఫ్యాక్టర్… ఎ.ఆర్.రెహమాన్ సంగీతం, రాజీవ్ మీనన్ దర్శకత్వం. తెలుగు చిత్రం `చైతన్య`తో సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్‌ని మొదలుపెట్టి… ఆ తరువాత `బొంబాయి` తదితర సినిమాల్లోని తన పనితనంతో భారతీయ ప్రేక్షకుల మనసును దోచుకున్నారు ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్. `మెరుపు కలలు`తో దర్శకుడిగా టర్న్ అయిన రాజీవ్… `ప్రియురాలు పిలిచింది`తోనూ మంచి మార్కులు పొందారు. దాదాపు 18 ఏళ్ళ తరువాత ఈ టాలెంటెడ్ టెక్నీషియన్ మెగాఫోన్ పట్టారు. ఆ చిత్రమే… `సర్వం తాళ మయం`. మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి కూడా ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు అందించగా… కథానాయకుడి పాత్రలో రెహమాన్ మేనల్లుడు, యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 1న విడుదల చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాతోనూ రాజీవ్ దర్శకుడిగా మరోసారి అలరిస్తారేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=Qet0IxVPoe8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: