యాత్ర సాంగ్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన వందేమాతరం శ్రీనివాస్

Vandemataram Srinivas Strong Comeback With Yatra Song,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Vandemataram Srinivas Comeback With Yatra Song,Yatra Movie Song,Vandemataram Srinivas Latest Movies News
Vandemataram Srinivas Strong Comeback With Yatra Song

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది గాయకులు ఉన్నారు..ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నారు కానీ.. విప్లగీతాలకు ప్రాణం పోసింది మాత్రం ఒక్క వందేమాతరం శ్రీనివాస్ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. వందేమాతరం సినిమాలో తరం మారుతున్నది, స్వరం మారుతున్నది అంటూ వందేమాతరం గీతానికి కొత్త అర్థం చెప్పి ఆ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్న సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు, నటుడు, దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్. ఆయన కెరీర్లో ఎన్నో విప్లవ గీతాలు, ఎన్నో ఉద్యమ గీతాలను వినిపించారు. ఎర్రజెండెర్రజెండ ఎన్నియలో.. అంటూ విప్లవగీతాలను ఆలపించడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఆయన పాటలు వింటే ఎక్కడలేని ధైర్యం రావాల్సిందే…ఆయన పాటలు వింటే పిడికిళ్లు బిగుసుకుంటాయి.. అంతేకాదు..మనసు కరిగించే పాటలు పాడటంలోనూ ఆయనకు ప్రత్యేక శైలి ఉందని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వందేమాతరం శ్రీనివాస్ ఇప్పటివరకు దాదాపు 200 సినిమాలకు సంగీతం అందించి ఉంటారు. వాటిలో విప్లవసినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఆ పాటలే ఆయనకు పేరు తీసుకురావడం వల్ల ఆయన విప్లవగీతాల గాయకుడిగానే ముద్రపడ్డారు. ఆయన కెరీర్‌లో ఓసేయ్ రాములమ్మ, స్వయంవరం, దేవుళ్లు చిత్రాలకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా, శ్రీరాములయ్య, ఒరేయ్ రిక్షా చిత్రాలకు ఉత్తమ గాయకుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ఒసేయ్ రాములమ్మా చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఆహా చిత్రానికి ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.

ఇప్పుడు తాజాగా మరోసారి యాత్ర సినిమాలో తన గళాన్ని విప్పి తన పవర్ ను మరోసారి నిరూపించారు. నిన్న యాత్ర సినిమాలోని రాజన్నా నిన్నాపగలరా లిరికల్ సాంగ్ రిలీజ్ అవ్వగా..ఈ పాటను వందేమాతరం శ్రీనివాస్ పాడటం విశేషం. రాజశేఖర రెడ్డి పాదయాత్రకు జనం ఎలా జేజేలు పలికారనే విషయాన్ని ఈ సాంగ్ కళ్లకు కట్టింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాట రాయగా.. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. ఈ నేపథ్యంలో వందేమాతరం పాడిన టాప్ సాంగ్స్ లిస్ట్ కింద ఇచ్చాం. ఆ పాటలు మీరు కూడా మరోసారి విని ఎంజాయ్ చేయండి.

*రాజన్నా నిన్నాపగలరా – యాత్ర

* నమ్మకు నమ్మకు ఆడాళ్లలోని ప్రేమలని – చెప్పవే చిరుగాలి

* మల్లెతీగకు పందరివోలే – ఒరేయ్ రిక్షా

* ఎర్రజెండ ఎర్రజెండ – చీమలదండు

* పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల – కుబుసం

* చుక్కలోకెక్కినాడు సక్కనోడు – జెమిని

* కడవ మీద కడవ పెట్టి – ఒసేయ్ రాములమ్మా

* చిన్ని చిన్ని ఆశలన్ని చిందులేసెనే – జయం మనదేరా

* ఎందిర ఒరి బామ్మర్ది – సామాన్యుడు

* జోహారు జోహారు – శ్రీ రాములయ్య

[subscribe]

[youtube_video videoid=G4iQhsJtIcg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.