కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో రజినీ లుక్ ను చూసి అందరూ ఫిదా అవుతుండగా..ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలతో ,రజినీ మార్క్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉండడంతో ఈ సినిమా సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీనిచ్చేలా ఉందంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను కూడా ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడు ప్రముఖులు కూడా హాజరవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
కాగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం లో సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ,శశి కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని విడుదలచేస్తున్నారు.
[youtube_video videoid=IdvX-hF7eYI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: