తమిళ ప్రజలు “అమ్మ “గా ఆరాధించే జయలలిత తెలుగు,తమిళ సినిమాలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించి, రాజకీయాలలో ప్రవేశించి తమిళ నాడు ముఖ్యమంత్రి గా ఎదిగారు. పేద ప్రజలకు మేలుకలిగేలా అనేక పథకాలు అమలు పరిచారు. తమిళనాడు లో లక్షలాది అభిమానులు ఉన్న దివంగత ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ ని ముగ్గురు తమిళ దర్శకులు అనౌన్స్ చేశారు. ప్రియదర్శిని దర్శకత్వం లో నిత్యా మీనన్ , ఏ ఎల్ విజయ్ దర్శకత్వం లో విద్యా బాలన్ లేదా నయనతార జయలలిత క్యారెక్టర్ లో
నటించనున్నారు. ప్రముఖ సీనియర్ దర్శకుడు భారతీ రాజా జయలలిత బయోపిక్ మూవీ రూపొందించనున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ జయలలిత బయోపిక్ ను వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 32 ఎపిసోడ్స్ గా రూపొందే స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. జయలలిత పాత్రకు రమ్యకృష్ణ ను ఎంపిక చేశారు. తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన టాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ , జయలలిత పాత్రకు ఎంపిక చేయడం ముదావహం. డేరింగ్, డైనమిక్ జయలలిత పాత్రకు రమ్య కృష్ణ అన్నివిధాలా అర్హురాలు అని చెప్పడంలో సందేహం లేదు.
[youtube_video videoid=xsTZWd1V_8M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: