ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ నుంచి గత చిత్రం ‘గురు’ వరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించడమే కాకుండా… పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ సీనియర్ హీరో. ఇదిలా ఉంటే… ఇప్పటివరకు సంక్రాంతి సీజన్‌లో వెంకీ కథానాయకుడిగా నటించిన 14 చిత్రాలు విడుదల కాగా… వాటిలో ఐదు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అంతేకాదు… సంక్రాంతి సీజన్‌లో సక్సెస్ అయిన ఈ సినిమాలన్నింటిలోనూ ఓ ఆసక్తికరమైన అంశం కూడా దాగి ఉంది. అదేమిటంటే… ఆ యా చిత్రాల్లో నటించిన కథానాయికలంతా వెంకటేష్‌తో కలిసి తొలిసారిగా నటించిన వారే కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… 1991 సంక్రాంతికి విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ ‘శత్రువు’లో వెంకీ సరసన విజయశాంతి తొలిసారిగా నటించగా… 1992 సంక్రాంతికి రిలీజైన ఇండస్ట్రీ హిట్ ‘చంటి’లో మీనా ఫస్ట్ టైమ్ వెంకీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే.. 2000 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్‘కలిసుందాం… రా!’లో సిమ్రాన్… ఆరేళ్ళ గ్యాప్ తర్వాత (2006) సంక్రాంతికి విడుదలైన హిట్ చిత్రం ‘లక్ష్మీ’లో నయనతార, ఛార్మి… మొదటిసారిగా వెంకటేష్‌తో ఆడిపాడినవారే కావడం విశేషం. అంతేకాదు… వెంకీ చివరి సంక్రాంతి హిట్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో నటించిన అంజలికి కూడా వెంకీ సరసన నటించడం అదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో… 2019 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఎఫ్-2’లో కూడా వెంకీ సరసన తమన్నా తొలిసారిగా నటించడం చూస్తే… ఈ సంక్రాంతికి కూడా `ఫస్ట్ టైం హీరోయిన్` కాన్సెప్ట్ వెంకటేష్‌కు మరోసారి వర్కవుట్ అయ్యేలానే ఉంది.
[youtube_video videoid=NRVS1twjYDg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: