ఏప్రిల్‌లో యువ హీరోల సంద‌డి

Tollywood Young Heroes Movies Releasing in April,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Heroes Movies in April,2019 Movies Releasing in Tollywood,Telugu Movies Releasing on April 2019,Tollywood Movies Releasing in April 2019,April 2019 Telugu Movies Release Date
Tollywood Young Heroes Movies Releasing In April

వేస‌విలో విడుద‌ల‌య్యే సినిమాల‌కు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి మైలేజ్ ఉంటుంది. యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా… సీజ‌న్ అడ్వాంటేజ్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన సినిమాలు చ‌రిత్ర‌లో ఎన్నో ఉన్నాయి. ఇక ఈ వేస‌విలో ముఖ్యంగా… ఏప్రిల్ నెల‌లో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే… సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`ని ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌బోతున్నట్లు ఇప్ప‌టికే యూనిట్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే నెల‌లో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ` కూడా విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఏప్రిల్ 19న ఈ సినిమాని రిలీజ్ చేయ‌బోతున్నట్లు అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. అలాగే… ఇదే నెల‌లో మ‌రో ప్రామిసింగ్ మూవీ రాబోతోంది. అదే `మ‌జిలీ`. పెళ్ళ‌య్యాక క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత న‌టిస్తున్న తొలి చిత్ర‌మిదే కావ‌డంతో… ఈ సినిమాపైనా మంచి అంచ‌నాలే ఉన్నాయి. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా విడుద‌ల చేసిన స్పెష‌ల్ పోస్ట‌ర్‌లో ఈ సినిమా ఏప్రిల్ నెల‌లో రాబోతున్నట్లు యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న ఇచ్చింది. ఈ చిత్రాల‌తో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్ `చిత్ర ల‌హ‌రి` కూడా ఇదే ఏప్రిల్ నెల‌లో తెర‌పైకి రాబోతుంద‌ని స‌మాచారం. సో… ఏప్రిల్ నెల‌లో ప‌లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ సంద‌డి చేయ‌బోతున్నాయ‌న్న‌మాట‌. మ‌రి… ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయిలో ఫెర్‌ఫామ్‌ చేస్తాయో తెలియాలంటే మ‌రికొన్నాళ్ళు ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=aC0lLhI39Io]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 4 =