`ఉయ్యాలా జంపాలా`, `మజ్ను` చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు విరించి వర్మ. ఈ యువ దర్శకుడు అతి త్వరలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని రూపొందించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా భావోద్వేగాలకు పెద్ద పీట వేసే కథాంశంతో తెరకెక్కనుందని తెలుస్తోంది. వేసవి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడతాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్… యాక్షన్ థ్రిల్లర్ `118`తో బిజీగా ఉన్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా నివేథా థామస్, షాలినీ పాండే నటిస్తున్నారు. మార్చి 1న ఈ సినిమా విడుదల కానుంది. కాగా… సంక్రాంతికి విడుదలైన `యన్.టి.ఆర్. కథానాయకుడు`లో తన తండ్రి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించి… అలరిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=xeXXbPfPuDg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: