ఒక సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టిలు ఉంటేనే ఆ సినిమా హిట్టవ్వుద్దా..ఫట్టావ్వుద్దా అన్న గ్యారెంటీ ఉండదు. ఒక్కోసారి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టొచ్చు. ఒక్కోసారి అసలు అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేయోచ్చు. అలాంటి ఉదాహరణలు చెప్పుకోవడానికి ఈ మధ్య చాలా సినిమాలే ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో కేవలం ఒకే ఒక్క పాత్రతో వస్తున్న సినిమా ప్రాణ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిత్యమీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమాను వీకే ప్రకాష్ తెరకెక్కిస్తున్నారు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుండి అంచనాలు బాగానే ఉన్నాయి. ఒకేసారి నాలుగు భాషలలో తెరకెక్కించడం.. ఒకే పాత్ర, దానికి తోడు ఫస్ట్ టైమ్ సరౌండ్ సింక్ సౌండ్‌తో చిత్రీకరణ..ఇండియా టాప్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్ గా పనిచేయడం ఇలా పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఇక ఈ సినిమా నిన్న మలయాళంలో రిలీజ్ అవ్వగా అంచనాలకు తగ్గట్టే సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం ఒక్క పాత్ర మాత్రమే ఉన్నా అలాంటి ఫీల్ ఎక్కడా రాకుండా సినిమాను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారట. ముఖ్యంగా లూయిజ్ బ్యాంక్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి హైలెట్ గా నిలిచిందట. మరోసారి నిత్యామీనన్ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. మరి మలయాళంలో అయితే మంచి టాక్ తో దూసుకుపోతుంది..ఇంకా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మరి చూద్దాం ఇక్కడ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంత వరకూ నచ్చుతుందో..
[youtube_video videoid=LiDDKnYtV8U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: