గతంలో శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘భారతీయుడు’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన కమల్ హాసన్ నటనను ఎవరు మరిచిపోలేదు. ముఖ్యంగా వృద్ద కమల్ హాసన్ పాత్ర ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమా సీక్వెల్ ను చేయడానికి సిద్దమయ్యారు కమల్ హాసన్, శంకర్. ‘2.ఓ’ తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే ‘భారతీయుడు 2’ సినిమాను మొదలుపెట్టేశాడు శంకర్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చకచకా పూర్తి చేసేశాడు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల నిర్వహించగా రెగ్యులర్ షూటింగ్ గతంలో చెప్పినట్టే ఈ రోజు(18-1-209) నుండి మొదలుపెట్టారు. తొలి షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.
కాగా ఈసినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. శింబు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో చేయనున్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎంత ఘన విజయం సాధిస్తుందో చూద్దాం..
[youtube_video videoid=jA0xiSGBGQs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: