ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఇస్మార్ట్ శంకర్` పేరుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరీ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరీ జగన్నాథ్‌తో కలసి కథానాయిక ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతమందించనున్నాడు. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ నెల 23న ప్రారంభం కానున్నాయని… అలాగే రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24 నుంచి మొదలుకానుందని టాలీవుడ్ టాక్. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి… వేసవి సందర్భంగా మే నెలలో `ఇస్మార్ట్ శంకర్`ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ సరసన ఓ కొత్త కథానాయిక నటించే ఈ సినిమాలో… రామ్ ఇదివరకు ఎప్పుడూ కనిపించిన ఓ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. గత కొంత కాలంగా సరైన విజయాలు లేని రామ్, పూరి… ఈ చిత్రంతో అయినా మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=nrQgHxNKrcQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: