`కొత్త బంగారు లోకం` వంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల… ఆ తరువాత విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్‌లో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` అనే మల్టీస్టారర్ ని రూపొందించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్‌కి ఊపు తెచ్చాడు. అయితే… ఆ తరువాత శ్రీకాంత్ దర్శకత్వంలో వచ్చిన `ముకుంద`, `బ్రహ్సోత్సవం` చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. దాదాపు మూడేళ్ళ విరామం తరువాత ఈ టాలెంటెడ్ డైరెక్టర్… తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థలో రూపొందనున్న ఈ సినిమాకి `కూచిపూడి వారి వీధి` అనే టైటిల్ ఖరారు అయ్యిందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరి… ఈ సినిమాతోనైనా శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=-VxKu8e1hPY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: