
ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 11


ఎఫ్ 2 లో వెంకటేష్ నట విజృంభన

జెర్సీ సినిమా టీజర్ రిలీజ్

17వ పూణే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మహానటి

118 రిలీజ్ డేట్ ఫిక్స్

కమల్ సినిమాలో కొరియన్ స్టార్ హీరోయిన్!

`ఎఫ్ 2`లో హైలైట్ సీన్ అదేనట...

పూర్తయిన సూర్యకాంతం మూవీ షూటింగ్

టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ అదిరాయిగా
గత సంవత్సరం “రంగస్థలం” తో "స్టార్ ఆఫ్ ది ఇయర్" గా నిలిచిన రామ్ చరణ్ తదుపరి చిత్రం" వినయ విధేయ రామ" అదే స్థాయి అంచనాలతో జనవరి 11న విడుదలైంది. కేవలం 11 చిత్రాలలోనే రెండు ఇండస్ట్రీ హిట్స్ కలిగిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. అయితే నిన్న విడుదలైన " వినయ విధేయ రామ" టాక్ కొంత డివైడెడ్ గా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో మాత్రం third topper గా నిలిచిందని ట్రేడ్ ఫిగర్స్ చెబుతున్నాయి. ఇప్పటివరకు నైజాంలో "బాహుబలి-2" డే వన్ కలెక్షన్స్ లో 6 కోట్ల షేర్ తో టాపర్ గా నిలవగా " వినయ విధేయ రామ " 7.20 కోట్ల షేర్ తో కొత్త టాపర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో " వినయ విధేయ రామ" ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ…

ఎఫ్ 2 లో వెంకటేష్ నట విజృంభన
సినిమా అన్నది ఎక్స్టర్నల్ గా ఆర్టిస్టుల మీడియా అయితే ఇంటర్నల్గా టెక్నీషియన్స్ మీడియా. ఆర్టిస్టులకు హెడ్ హీరో అయితే టెక్నీషియన్స్ కు హెడ్ దర్శకుడు. అయితే ప్రజాబాహుళ్యంలో హీరోకు ఉండే పాపులారిటీ దర్శకులకు ఉండకపోవచ్చు గాని దర్శకుడు క్రియేట్ చేసే పాత్ర వల్లనే హీరో ఎలివేట్ అవుతాడు. ప్రతి దర్శకుడు తన హీరోకి ఒక అద్భుతమైన పాత్రను క్రియేట్ చేసి హిట్ కొట్టాలనే ప్రయత్నిస్తాడు. కానీ అన్ని సందర్భాలలో అన్ని పాత్రలు క్లిక్ అవ్వవు. కానీ ఇవ్వాళ రిలీజైన ఎఫ్-2 చిత్రంలో ఒక మంచి కాంబినేషన్ వండర్ కనిపించింది. నిజానికి ఒక సినిమా జయాపజయాలలో ఆర్టిస్టుల కన్నా దర్శకుడి ప్రభావ, ప్రమేయాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక…

సంస్కృత భాషలో ప్రాణ ప్రమోషనల్ వీడియో సాంగ్ రిలీజ్
వైవిద్యమైన పాత్రలు ఎంచుకోవడంలో నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి తను ఇంతవరకూ చేసిన సినిమాలు చూస్తే అర్ధమవుతోంది. ఇప్పుడు అదే మరోసారి నిరూపించింది. ప్రాణ అనే కొత్త కాన్సెప్ట్..తన ఒక్క పాత్ర మాత్రమే ఈ సినిమాలో ఉంటుంది..అలాంటి కాన్సెప్ట్ సినిమాలో నటిస్తోంది నిత్యామీనన్. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. మలయాళంలో ఈ సినిమా ను జనవరి 18వ తేదీన విడుదల చేస్తుండగా...తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను... ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

`సైరా` కోసం స్పెషల్ సెట్టింగ్స్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండగా... సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి సగానికి పైగా చిత్రీకరణ పూర్తయ్యింది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమా కోసం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం రోడ్డులోని ఘాట్ కంచె భూముల్లో భారీ సెట్టింగ్స్ కి సంబంధించిన పనులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ…

ఈ సంక్రాంతి సినిమాల్లో కామన్ ఫ్యాక్టర్ ఇదే..
2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఆ చిత్రాలే... `యన్.టి.ఆర్.కథానాయకుడు`, `పేట`, `వినయ విధేయ రామ`, `ఎఫ్ 2`. ఈ నాలుగు సినిమాలూ అగ్ర కథానాయకుల చిత్రాలు కావడం ఓ విశేషమైతే... మరో విశేషం కూడా ఉంది. అదేమిటంటే... ఈ సంక్రాంతి మూవీస్‌లో... ఆ యా హీరోలకు జోడీగా నటించిన వారంతా మొదటిసారిగా నటించిన వారే కావడం.

కృష్ణ, శోభన్‌బాబు ‘మంచి మిత్రులు’కి 50 వసంతాలు
కృష్ణ, శోభన్‌బాబు కలయికలో వచ్చిన పలు మల్టీస్టారర్ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘మంచి మిత్రులు’ ఒకటి. స్నేహబంధం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాని మధు పిక్చర్స్ పతాకంపై పి.మల్లికార్జునరావు నిర్మించగా తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. ఇందులో విజయనిర్మల, చలం, నాగభూషణం, గీతాంజలి ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఎస్.పి.కొదందపాణి సంగీతసారథ్యంలో పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ ఈనాటికి వినిపిస్తూనే ఉంటుంది. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన మూడో చిత్రం ఇది. అంతేకాదు... కృష్ణ, శోభన్ బాబును తొలిసారిగా…

వెంకటేష్ ‘ప్రేమ’కు 30 వసంతాలు
''ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ... ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ... ప్రేమ దివ్య భావము... ప్రేమ దైవరూపం... ప్రేమ జీవరాగం... ప్రేమ జ్ఞానరూపం... మనసున పారే సెలయేరు ప్రేమ... అలసట తీర్చే చిరుగాలి ప్రేమ... హద్దులేవి లేనిది అందమైన ప్రేమ''... `ప్రేమ` గురించి ఇంత కన్నా ప్రేమగా చెప్పడం కష్టమేమో కదా! మనసుకవి ఆత్రేయ అందించిన ఈ సాహిత్యంతో వచ్చిన ఆ చిత్రమే `ప్రేమ`.

ఎఫ్ 2 తెలుగు మూవీ రివ్యూ - ఫస్ అండ్ ఫన్ ఓన్లీ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుళ్లు చెప్పినట్టే మంచి గా నవ్వించేసి పనిలో పనిగా సక్సెస్ కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. అన్ని వర్గాలవారు చూసి మంచిగా నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు.

తెలుగు సినిమా చరిత్రలో జనవరి 12న విడుదలైన జనరంజక చిత్రాలు
సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న విడుదలైన పలు చిత్రాలు... అటు కథా పరంగాను, ఇటు సంగీతం పరంగాను ప్రేక్షకులను అలరించాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళ్తే...

జెర్సీ సినిమా టీజర్ రిలీజ్
మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఓ వైవిధ్యమైన కథ జెర్సీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 19వ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుపుతున్న చిత్రయూనిట్...ఈ నేపథ్యంలోనే టీజర్ ను కూడా రిలీజ్ చేసింది.

17వ పూణే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మహానటి
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందిన లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి 2018 మే 9 తేదీ రిలీజయి విజయ ఢంకా మ్రోగించింది. తమిళ, మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ కూడా విజయం సాధించాయి. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలలో నటించగా నాగ చైతన్య, మోహన్ బాబు, నరేష్, దర్శకులు క్రిష్, సందీప్ వంగ, తరుణ్ భాస్కర్, రచయిత బుర్రా సాయి మాధవ్ అతిథి పాత్రలలో నటించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీ పార్వతి ఎవరో చెప్పిన వర్మ
రామ్ గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. టైటిల్ తోనే సినిమాపై ఫస్ట్ నుండి హైప్ పెంచిన వర్మ దాని తరువాత వరుసపెట్టి పాటలు విడుదల చేస్తూ అటు విమర్శల తో పాటు ఇటు కొంతమంది వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. వెన్నుపోటు అని విడుదల చేసిన మొదటి పాటతోనే సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తినిపుట్టించాడు. దాని తరువాత ఎందుకు? అనే పాట విడుదల చేసి మరోసారి మరో సంచలనానికి తెర తీశాడు.

118 రిలీజ్ డేట్ ఫిక్స్
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఇటీవలే నా నువ్వేతో అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు 118 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి ఏదో విభిన్నమై కాన్సెప్ట్ తో వస్తున్నట్టే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈసినిమా తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. మార్చి 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

జనవరి 11... తెలుగు సినిమా చరిత్రలో `వన్ ఆఫ్ ది లక్కీయస్ట్ డేట్స్`
కొన్ని తేదీలు భలేగా మ్యాజిక్ చేస్తాయి. తెలుగు సినిమాకు సంబంధించి కూడా అలాంటి తేదీలు కొన్ని ఉన్నాయి. వాటిలో జనవరి 11 ఒకటి. సంక్రాంతి సీజన్ సందర్భంగా ఈ తేదికి విడుదలైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలాగే ఇండస్ట్రీ హిట్ కూడా వచ్చిన వైనం ఉంది.

వినయ విధేయ రామ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే అన్ని వర్గాలకు మెప్పింస్తుందని చెప్పలేం కానీ... మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చే సినిమా అని చెప్పొచ్చు.

కమల్ సినిమాలో కొరియన్ స్టార్ హీరోయిన్!
2.0 సినిమా అలా అయిందో లేదో ఇలా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 సినిమా పనిలో పడిపోయారు డైరెక్టర్ శంకర్. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాంతో ఈ సీక్వెల్ పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా కాజల్ నటిస్తుందన్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు తాజాగా మరో భామ కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ భామ ఎవరనుకుంటున్నారా..?

మహానటి తరువాత మరోసారి సాహసం చేయనున్న కీర్తి సురేష్
మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ రేంజ్ ఒక్క సారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. సావిత్రగా చేసిన కీర్తి సురేష్ నటనకు అందరూ ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తి సురేష్ లో ఇంత టాలెంట్ ఉందా..ఇంతకు ముందు చూసిన కీర్తి సురేషేనా అని ఆశ్చర్యానికి గురైనవారు లేకపోలేదు. అంతలా మంచి పేరుతో పాటు.. మంచి గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది మహానటి సినిమా కీర్తి సురేష్ కు. ఇక మహానటి తరువాత అన్ని లేడి ఒరియెంటెడ్ సినిమాలే క్యూ కట్టడంతో తెలుగులో ఏ సినిమాకు ఓకే చెప్పకుండా కాస్త మాస్ టచ్ ఉండే పందెంకోడి2, సామి, సర్కార్ లాంటి చిత్రాల్లో నటించి తనలోని మరొక యాంగిల్ ను చూపించింది. అయితే ఆ సినిమాల్లో పెద్దగా చేయడానికి ఏం లేదు కాబట్టి…

`ఎఫ్ 2`లో హైలైట్ సీన్ అదేనట...
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌కి కామెడీ టైమింగ్‌లో తిరుగులేదు. ముఖ్యంగా...`ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లీశ్వరి`లో వెంకీ కామెడీకి ఫిదా కాని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. మళ్ళీ... చాన్నాళ్ళ తరువాత ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌తో వెంకీ సందడి చేయనున్నారు. ఆ చిత్రమే `ఎఫ్ 2`. వరుణ్ తేజ్ మరో హీరోగా నటించిన ఈ సినిమాని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించగా... హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కాగా... ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లో వెంకీ తన హాస్యనటనతో సినిమాపై అంచనాలు పెంచేశారు.

పూర్తయిన సూర్యకాంతం మూవీ షూటింగ్
మెగా బ్రదర్ నాగేంద్రబాబు తనయ నిహారిక కొణిదెల ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ లో నటించి, ఒక మనసు మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించారు. తరువాత నాన్నకూచి వెబ్ సిరీస్ లో నటించి నిర్మించారు. తమిళ భాషలో కూడా ఒక మూవీ లో నటించారు. ఇప్పుడు సూర్యకాంతం మూవీ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.

`ఆర్ ఆర్ ఆర్` కోసం బాలీవుడ్, సౌత్ ఇండియన్ భామలు?
`బాహుబలి` సిరీస్‌తో నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఈ మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్... యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తెరపై చాలా కాలం తరువాత వస్తున్న సిసలైన మల్టీస్టారర్ కావడంతో... ఈ భారీ బడ్జెట్ మూవీపై సర్వత్రా మంచి అంచనాలే ఉన్నాయి. కేవలం తెలుగులోనూ కాకుండా... ఇతర భాషల్లోనూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` (వర్కింగ్ టైటిల్)... ఫిబ్రవరి నుంచి…