`సాహో` కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ డ్యాన్సర్స్‌

Prabhas Saaho To Feature International Dancers,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Saaho To Feature International Dancers,Prabhas Saaho Movie Latest News,Prabhas To Dance With International Dancers in Saaho Movie,Saaho Movie Latest Updates,#Saaho
Prabhas Saaho To Feature International Dancers

‘బాహుబలి’ సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న‌ చిత్రం ‘సాహో’. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా… తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ తెర‌కెక్కుతోంది. ప్ర‌భాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ నాయిక‌గా న‌టిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో… యాక్ష‌న్ సీక్వెన్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని ఓ పాట కోసం ప్రభాస్‌తో కలసి ఇంట‌ర్నేష‌న‌ల్‌ డ్యాన్సర్లు లారెంట్‌ నికోలస్‌, లారీ నికోలస్‌లు స్టెప్పు లేయనున్నారట. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఈ ఇద్ద‌రూ కూడా కవలలు కావడం విశేషం. అంతర్జాతీయ పాప్‌ గాయని బియాన్స్‌ పాటల్లో ఆమెతో కలసి స్టెప్పులేసిన ఈ ట్విన్స్‌… ఇప్పుడు ప్ర‌భాస్‌తో కాలు క‌ద‌ప‌డం ప్ర‌త్యేక‌మైన విష‌యంగానే చెప్పాలి. అంతేకాదు… జాతర నేపథ్యంలో సాగే ఓ పాట కూడా `సాహో`లో ఉంద‌ట‌. అధిక సంఖ్య‌లో బ్రెజీలియన్‌ డ్యాన్సర్లు పాల్గొనే ఈ గీతం కోసం ఓ భారీ సెట్‌ను కూడా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. వైభవీ మర్చంట్ కొరియోగ్ర‌ఫీ అందించే ఈ పాటను త్వరలోనే తెరకెక్కించనున్నట్టు తెలిసింది. కాగా… ఆగ‌స్టు 15న `సాహో` తెర‌పైకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=9o8Ri5PH1VE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + seven =