సంక్రాంతి కానుకగా విడుదలైన `ఎఫ్ 2`తో తన ఖాతాలో మరో విజయాన్ని జమ చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సీనియర్ హీరో వెంకటేష్ కాంబినేషన్‌లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే… తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు వరుణ్. తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు రూపొందించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు… ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనుండగా… అతని కోచ్‌గా సీనియర్ హీరో అర్జున్ నటించనున్నాడని టాక్. బాక్సర్ పాత్ర కోసం ఇప్పటికే వరుణ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా… ఈ సినిమాని అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ నిర్మించనుండగా… వరుణ్ తేజ్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలిసింది. ఫిబ్రవరిలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. కథానాయకుడిగా ఘనవిజయాలు అందుకుంటున్న వరుణ్… నిర్మాణ రంగంలోనూ సక్సెస్ కావాలని కోరుకుందాం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=53HvB3Yrgik]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: