తెలుగు ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను ఎంత అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలను అమితంగా అభిమానించడంలో తెలుగు ప్రజల తరువాతే ఎవరైనా. వారి అభిమానానికిి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అలాగే హీరోలు కూడా తమ అభిమానుల పట్ల అంతే ప్రేమను చూపిస్తుంటారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా? అసలు సంగతేంటంటే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ అభిమాని అయిన శ్రీను అనే వ్యక్తి ఈరోజు మరణించారు. దీంతో శ్రీను మృతిపై చలించిన సందీప్ కిషన్.. అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ… శ్రీను కుటంబం బాధ్యతను తాను తీసుకున్నట్టు తన ట్విట్టర్ ద్వారా భావోద్వేగంతో కూడిన పోస్ట్ ఒకటి పెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నాకు మద్దతుగా ఉండి..నా వెనుక ఉన్న ఏకైక, నీజాయితీగల అభిమాని శ్రీను… నా సోదరుణ్ణి నేను కోల్పోయాను. చిన్న వయసులో ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను శ్రీను… నీ కుటుంబం బాధ్యత నాది. లవ్యూ శ్రీను. ఎప్పటికీ నిన్ను మిస్ అవుతుంటా. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా” అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.
He was one of my biggest support systems and always stood by me rock solid..my 1st and most loyal fan…I have lost a brother…too young to be gone…Neeku eppatiki runa padi untanu sreenu..nee kutumbam badyatha Naadi…love you sreenu..will miss you forever…Rest in peace… pic.twitter.com/J66Dydv5B4
— Sundeep Kishan (@sundeepkishan) January 18, 2019
మరి కేవలం తమ అభిమానుల అభిమానాన్ని చూసి..అలా వదిలేకుండా.. వారు కష్టాల్లో ఉన్నప్పుడు.. వారి సమస్యలను కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చినప్పుడే రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కూడా హీరోలనిపించుకుంటారు. ఇప్పుడు సందీప్ కిషన్ కూడా ఈ పనితో నిజమైన హీరో అనిపించుకున్నాడు.
[youtube_video videoid=8VSYF73nG6M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: